చిరంజీవిని వాడుకోలేక పోయాం.. ఆస్తున్నీ అమ్మేయాల్సి వచ్చింది     2018-08-29   13:26:57  IST  Rajakumari K

మెగాస్టార్‌ చిరంజీవి ఏదైనా చిన్న చిత్రం గురించి మాట్లాడితే ఆ సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కుతుంది. సినిమా ఎలా ఉన్నా కూడా చిరంజీవి మాట్లాడు కదా అని ఎంతో మంది చూడాలనుకుంటారు. చిరంజీవితో పబ్లిసిటీ చేయించేందుకు ఎంతో మంది చిన్న చిత్రాల మేకర్స్‌ పడిగాపులు పడుతూ ఉంటారు. అయితే జయసుధ కొన్నాళ్ల క్రితం నటించి ‘హ్యాండ్స్‌అప్‌’ చిత్రంలో చిరంజీవి నటించినా ఫ్లాప్‌ అయ్యిందట. ఈమాట స్వయంగా జయసుధ అనడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

Actress Jayasudha Comments On Chiranjeevi Hands Up-

Actress Jayasudha Comments On Chiranjeevi On Hands Up

అసలు విషయం ఏంటీ అంటే జయసుధ నిర్మాణంలో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాండ్స్‌అప్‌’. భారీ అంచనాల నడుమ అప్పట్లో ఈ చిత్రం తెరకెక్కింది. చిత్రానికి హైప్‌ తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో చిరంజీవిని ఈ చిత్రంలో గెస్ట్‌ పాత్రలో చూపించారు. చిరంజీవి గెస్ట్‌గా నటించేందుకు జయసుధపై అభిమానంతో ఒప్పుకున్నాడు. చిరంజీవి గెస్ట్‌గా నటించడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఆనందంతో ఆయన ఫొటోను పోస్టర్స్‌పై పెద్దగా వేయానుకున్నారు. కాని అందుకు చిరంజీవి నో చెప్పాడు. నా ఫొటోను పెద్దగా వేస్తే సినిమాలో నేనే ఎక్కువగా ఉన్నాను అనుకుని ప్రేక్షకులు వచ్చి, నిరాశ చెందుతారు. అందుకే నా ఫొటో వద్దు అని ఆయన సూచించినట్లుగా జయసుధ అన్నారు.

Actress Jayasudha Comments On Chiranjeevi Hands Up-

ఆయన మాటపై నమ్మకంతో, ఇతయి చెప్పిన దాన్ని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో చిరంజీవి గారి ఫొటోను వేయలేదు. దాంతో సినిమాకు ఫ్లాప్‌ టాక్‌ వచ్చింది. కనీసం ఓపెనింగ్స్‌ కూడా దక్కలేదు. ఒక వేళ సినిమా పోస్టర్‌పై చిరంజీవి గారి బొమ్మను వేసి ఉంటే ఖచ్చితంగా సినిమాపై అంచనాలు పెరిగి ఓపెనింగ్స్‌ వచ్చేవి. దాంతో పెట్టిన బడ్జెట్‌ అయినా రికవరీ అయ్యేది అంటూ జయసుధ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది.

సినిమా నష్టాలకు ఆస్తులను అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఆ నష్టాల నుండి బయటకు వచ్చేందుకు దాదాపు అయిదు ఏళ్లు పట్టింది. అంతకు ముందు కూడా జయసుధ నిర్మించిన చిత్రాలు ఫ్లాప్‌ అయ్యాయి. కాని ఇంత భారీ స్థాయిలో నష్టాలు రాలేదట. చిరంజీవిని వాడక పోవడం వల్ల ఇంత నష్టం జరిగింది అంటూ తాజాగా ఆలీ షోలో పాల్గొన్న జయసుధ చెప్పుకొచ్చింది.