ఏపీలోనూ 'ముందస్తు'.. జగన్ ప్రకటనతో సంచలనం

ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ కు ఎన్నికల కంగారు బాగా ఎక్కువయినట్టు కనిపిస్తోంది.తెలంగాణాలో కేసీఆర్ అలా అయితే ముందస్తు ఎన్నికలపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడో సరిగ్గా అలాగే ఇప్పుడు జగన్ కూడా ఆ విషయంగానే కలవరిస్తున్నట్టు కనిపిస్తోంది.

 About Early Election Announced By Ys Jagan-TeluguStop.com

విశాఖ పాదయాత్రలో ఉన్న జగన్ ఈ మేరకు ముందస్తు ఎన్నికలపై ప్రకటన చేసి పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేశాడు.సాధారణంగా సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ – మే నెలలో జరుగుతాయి.

కానీ ఈ సారి ఎన్నికలు ముందుగా అంటే జనవరిలోనే జరుగుతాయని దానికి పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని జగన్ పిలుపు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది.

నాలుగైదు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి కానీ.ఏపీలో ఎలా జరుగుతాయని.వాళ్లు తికమకపడ్డారు.

షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏప్రిల్, మే నెలలలో ఎన్నికలు జరుగుతాయి.ఎలా లేదన్నా ఏడెనిమిది నెలలు పడుతుంది.

జగన్ కు ఈ విషయం తెలియనిదేమీ కాదు.అయినా నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో జనవరి నాటికి సర్వం సిద్ధంగా ఉండాలని జగన్‌ పిలుపు ఇవ్వడం ఎవరికీ అంతుపట్టడంలేదు.

జగన్ మాటలను cచూసుకుంటే.ప్రభుత్వం కూడా ముందస్తుకు వెళ్లే ఆలోచన లో ఉందా.కేంద్రంతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా జగన్ కు ఆ విషయం ముందే తెలిసిందా అనే అనుమానాలు ఇప్పుడు వైసీపీలోనే బయలుదేరాయి.మరికొంత మంది శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడను గుర్తుకు చేసుకుంటున్నారు.

విచారణ సంస్థలు చంద్రబాబును అరెస్ట్ చేస్తాయని జగన్ భావిస్తున్నారని.అందుకే నాలుగైదు నెలల్లోనే ఎన్నికలొస్తాయని ఊహిస్తున్నారని మరికొందరు సెటైర్ వేస్తున్నారు.

అయితే ప్రస్తుత పార్టీ పరిస్థితిపై పీకే టీం సర్వే నిర్వహించిందని, ఆ సర్వే ప్రకారం చాలా నియోజకవర్గాల్లో పార్టీ వీక్ గా ఉందని, దీంతో ఆ ఇన్ చార్జ్ లకు జగన్ క్లాస్ పీకారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉత్సాహ పరచడానికి జగన్ ముందస్తు ఎన్నికలంటూ ప్రకటన చేసి ఉండవచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube