హరికృష్ణ గారికి ఆ హోటల్ రూమ్ కి లింక్ ఏంటి.? ముందు రోజు రాత్రి 1 కి అక్కడే.?     2018-09-03   10:48:40  IST  Sai Mallula

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు. నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గురువారం ఆయన అంతక్రియలు ముగిసాయి. ఆయన మరణం తరవాత అబిడ్స్‌లోని ‘ఆహ్వానం’ హాటల్ చర్చనీయాంశం అయింది. ఆ హోటల్ కి ఆయనకీ ఉన్న సంబంధం ఏంటి అనుకుంటున్నారా.? వివరాల లోకి వెళ్తే..

Aahwanam Hotel Was The Care Of Address To Nandamuri Harikrishna-

Aahwanam Hotel Was The Care Of Address To Nandamuri Harikrishna

హోటల్‌లోని రూమ్ నెం. 1001లో హరికృష్ణ కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు వెళ్లి 10 గంటల వరకు అక్కడ గడపటం, మళ్లీ భోజనం చేసిన తర్వాత సాయంత్రం వరకు గడపటం ఆయనకు అలవాటు. ఈశాన్య మూల, తూర్పు ముఖంతో ఉండటం వల్ల ఇది తనకు ఎంతో కలిసొచ్చిందని హరికృష్ణ విశ్వసించేవారట. దీనికి వాస్తు పరంగా కూడా కొన్ని మార్పులు చేయించారు

Aahwanam Hotel Was The Care Of Address To Nandamuri Harikrishna-

గత 17 ఏళ్ల నుంచి ఆహ్వానం హోటల్‌లో సేవలందిస్తున్న రమణయ్య.. సార్‌కు ప్రతీది నేనే చూసుకొనే వాడిని అని చెప్పారు. హోటల్‌కు వస్తే ముందుగా నా పేరు పెట్టి పిలిచేవారు అని రమణయ్య గుర్తు చేసుకొన్నారు. ఆహ్వానం హోటల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు నేను వెళ్తున్నా. జాగ్రత్తగా చూసుకో అని చెప్పేవారు. అలాంటి వ్యక్తి లేరంటే నమ్మలేకపోతున్నాను. చనిపోయేముందు రోజు కూడా ఉదయం 6 గంటలకు ఈ హోటల్ కు వచ్చారు. సాయంత్ర 5 గంటలకు వరకు గడిపారు. రాత్రి డిన్నర్ పూర్తయిన తర్వాత తనకు ఎంతో ఇష్టమైన 1001 రూములోనే నిద్రించారు. ఫ్రెండ్ కొడుకు మ్యారేజి ఉంది వెళుతున్నాను అన్నారు. రేపు వస్తానో రానో అని చెప్పి తలుపేసుకున్నారు. రాత్రి 1 గంటకు నిదలేపమని చెప్పారు. ఆయన్ను నిద్రలేపడానికి రిసెప్షన్ నుండి ఫోన్ చేయించాం. ఆయన లేచి రెడీ అవుతున్నానమ్మా అన్నారు. అదే ఆఖరి మాట అని తెలిపారు.