ఆ గ్రామస్థులంతా ఒకే పని చేస్తూ నెలకి లక్షలు సంపాదిస్తున్నారు..ఇంతకీ అది ఏ గ్రామం?ఆ గ్రామ ప్రజలు చేస్తున్న పనేంటి?   A Village Success Story Earning Rs 50lakhs Per Month From Home     2018-09-07   12:24:13  IST  Rajakumari K

ఎవరో వస్తారని,ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా అనే పాటను ఆ ఊరిప్రజలందరూ మూకుమ్మడిగా పాడుకుంటున్నారు.అందుకే వర్షాలు లేక,వ్యవసాయం చేసినా ఫలితం లేకపోవడంతో కష్టాలపాలయినప్పటికీ ఆత్మహత్యల బాట పట్టకుండా దానికి ప్రత్యామ్నయం ఏంటో ఆలోచించి..ఆ దిశగా అడుగులు వేశారు…విజయం సాధించి..నెలకు లక్షలు సంపాదిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు..ఇంతకీ వారు చేస్తున్నపని ఏంటో తెలుసా పాలు అమ్మడం..మీరు చదివింది నిజమే..ఇంతకీ అది ఏ ఊరో తెలుసా..

రాయలసీమలో నీటి కరువు గురించి మనకు తెలియని విషయం కాదు.. అందుకు చిత్తూర్ జిల్లా మోటుకు గ్రామం కూడా మినహాయింపు కాదు.ఇలాంటి కరువు పరిస్థితులలో గ్రామం లోని కొంత మంది రైతులు వ్యవసాయం వదిలేసి జెర్సీ ఆవులను కొని పాడి పరిశ్రమలవైపు మొగ్గు చూపారు. 1975 ప్రాంతంలో ఒకరితో ప్రారంభమైన ఈ పాడి పరిశ్రమ తర్వాత తర్వాత ఆ ఊరు అంతా పాకింది . ఇప్పుడు అక్కడ ఒక్కో కుటుంబం 5 నుంచి 6 జెర్సీ ఆవులను పెంచుకుంటున్నారు. ఉదయం మరియు సాయంత్రం వాటి నుంచి రోజుకి 40 నుండి 70 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక ఆ ఊరు మొత్తం కలుపుకుంటే రోజుకి 4 నుంచి 5 వేల లీటర్లు డైరీలకు పోస్తారు. ఊరు మొత్తానికి మాములుగా ఒక పల్లె అయితే 15 రోజులకి వచ్చే పాల బిల్లు ఊరి మొత్తానికి కలిపి లక్ష లేదా 2 లక్షల రూపాయిలు ఉంటాయి. కానీ ఇక్కడ వింత ఏమిటి అంటే ఒక కుటుంబం రూ.30 వేలు నుంచి రూ.1 లక్ష వరకు సంపాదిస్తున్నారు. ఇక ఊరు మొత్తానికి వచ్చే పాల బిల్లు అయితే రూ.50 లక్షలు దాటుతోంది. ఆగష్టు మరియు సెప్టెంబర్ మధ్య జెర్సీ ఆవులు పాలు ఎక్కువగా ఇస్తాయి.కాబ్బటి ఆ సమయంలో పాలు దిగుబడి ఒక 1000 లీటర్లకి పెరిగి ఆదాయం ఇంకా పెరుగుతుంది . పాడి పరిశ్రమలలో ఒకసారి పెట్టుబడి పెడితే చాలు కూలీల అవసరం ఉండదు నెలానెలా ఆదాయం కచ్చితంగా వస్తుంది. దాంతో ఈ జెర్సీ ఆవులను కొన్న రైతులు ఆర్ధికంగా బాగా స్థిరపడ్డారు.

A Village Success Story Earning Rs 50lakhs Per Month From Home-

కొత్త వాళ్ళు ఎవరన్నా మోటుకుకి వస్తే ఆ ఊరికి పాడి పరిశ్రమ చూసి ఆశ్చర్య పోతారు .వంద ఇల్లు ఉన్న ఆ ఊరులో 1000 కి పైగా ఆవులు, దూడలు ఉన్నాయి అంటే ఆ ఊరి పాడి పరిశ్రమ ఏ స్థాయిలో ఉంటుందో మీరే ఊహించుకోండి. రైతులు జెర్సీ ఆవుల ధర ఎక్కువే అయిన పూటకి 5 నుంచి 15 లీటర్ల వరకు పాలను ఇస్తుంది. కాబ్బటి లాభం ఎక్కువ ఉంటుంది అని ఈ గ్రామంలో వారందరూ జెర్సీ అవునే పెంచుతున్నారు అంతే కాదు ఇక్కడ రైతులు జెర్సీ ఆవులకు కావలసిన గడ్డిని తమ పొలంలోనే పెంచుతున్నారు. దీనివల్ల గడ్డి కొనే ఖర్చు కూడా తగ్గుతోంది.

మోటుకుకు చెందిన ఒక వ్యక్తి ఇంటర్మీడియట్ అయిపోయాక తండ్రి మరణించాడు. దాంతో చదువు ఆపేయాల్సి వచ్చింది. ఇక మొదటిలో వ్యవసాయం చేసినా లాభాలు రాకపోవడంతో ,తన స్నేహితుడు మాట విని 5 జెర్సీ ఆవులను కొన్నాడు. ఇక ఇప్పుడు రోజుకి 40 లీటర్ల పాలు అమ్ముతూ చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న తన తమ్ముడి సంపందనతో పోటీ పడుతున్నాడు. పాడి పరిశ్రమని పాడి పరిశ్రమని నమ్ముకున్న కనుకే ఉద్యోగం లేదు అని బాధ కూడా లేదు పైగా ఉదయం రెండు గంటలు మరియు సాయంత్రం రెండు గంటలు ఎక్కువ పని ఉంటుంది అంతే ఇక మిగిలిన సమయంలో వేరే పని చేసుకోవచ్చు అంటూ హుషారుగా చెప్తున్నాడు.కష్టాలొచ్చాయని జీవితం అక్కడితో ఆపేయకుండా మరో మార్గం ఎంచుకుని విజయం సాధిస్తున్న మోటుకు ప్రజలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.