కన్నతల్లితో ఆ కూతురు ఎలాంటి నీచమైన పనులు చేయించిందో తెలుసా.? చివరికి ఫేస్ బుక్ ఎలా బుద్ది చెప్పిందంటే.!   A Mother And Daughter Story     2018-09-15   08:33:51  IST  Sainath G

సోషల్ మీడియా అసలేం చేయగలదు? ఆ…అయితే రెండు కుళ్లు జోకులు.. మా..అంటే మూడు టైంపాస్ ముచ్చట్లు…అంతకు మించితే సెల్ఫ్ డబ్బాలు,అదీ దాటితే….సినీ తారాల పర్సనల్ ముచ్చట్లు…!! నిజంగా సోషల్ మీడియా దానికే పరిమితం అనుకుంటున్న తరుణంలో…. అదే సోషల్ మీడియానుపయోగించి కన్న తల్లిని రాచిరంపాన పెడుతున్న కూతురికి బుద్దిచెప్పాడో పెద్దమనిషి. అసలెటువంటి సంబంధం లేకున్నా… రంగంలోకి దిగి, సొంత ఇంట్లో బంధీగా కాలం వెల్లదీస్తున్న ఓ వృద్దురాలికి కొత్తజీవితాన్ని ప్రసాదించాడు ఆ పెద్దమనిషి.

వివరాళ్లోకెళితే…
ఆమె పేరు గోదారమ్మ, వయస్సు:73 సంవత్సారాలు, టీచర్ గా రిటైర్డ్ కావడంతో నెలకు 40 వేల రూపాయల పించను వస్తుంది, హైదరాబాద్ లో కొత్తపేట దగ్గర తనకంటూ సొంత ఇల్లు కూడా కొనుక్కుంది. ఆమెకు ఒక్కగానొక్క కూతురు.కానీ సొంత కూతురే కన్నతల్లిని చిత్రహింసలకు గురిచేసేది. భర్తతో కలిసి కన్నతల్లిని అష్టకష్టాలు పెట్టేది. గోదారమ్మ భర్త చనిపోవడంతో ఆమె ఇంట్లోకి వచ్చి చేరిన కూతురు, అల్లుడు ఆమెకు ప్రత్యక్ష నరకాన్ని చూపించారు.

కన్నతల్లిని ఎలా చూసేవారంటే..

కూతురు, అల్లుడు నాలుగైదు రోజులు ఊరెళితే.. తలుపు తాళంపెట్టి వెళ్లిపోతారు… గోదారమ్మను బందీగా చేసి. రాత్రి పదీ పదకొండింటప్పుడు గోదారమ్మను కొట్టి మరీ చేతితో లెట్రీన్ ను క్లీన్ చేయిస్తారు. బ్రష్ తో క్లీన్ చేస్తానంటే.. బ్రష్ తో సరిగ్గా క్లీన్ కాదు.. చేతితో కడుగు అని కడిగిస్తారు.
బ్రెడ్ పెడితే.. తినడం ఇష్టంలేక చెత్తబుట్టలో పారేస్తే.. చెత్తబుట్టలోంచి ఏరుకొచ్చి మరీ తినిపిస్తారు.
అల్లుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు అని కూతురికి మొరపెట్టుకుంటే.. అవునా.. అని తానూ నాలుగు జోడిస్తుంది.
ఇదేంటండీ అని ఇరుగు పొరుగు వాళ్లు అడిగితే మా అమ్మకు పిచ్చి పట్టిందని…. దొంగ సర్టిఫికేట్లను చూపించేవారు.
తిట్లు, తన్నుడు కార్యక్రమాలు అయిపోయాక, కూతురు గది మధ్యలో గంభీరంగా నిలబడుతుంది.తప్పైందమ్మా క్షమించూ అంటూ గోదారమ్మ కూతురి కాళ్లకు మొక్కుతుంది. ఇదంతా వీడియో చిత్రీకరణ జరుగుతుంది. మనబోటి వాళ్లు ఎవరన్నా వేధింపుల గురించి నిలదీస్తే….. అయ్యో అంతా అబద్ధమండీ. ఆమెకు పిచ్చి. అన్నీ పిచ్చిపనులే చేస్తుంటుంది. కావాలంటే చూడండి.. ఎవరన్నా కూతురి కాళ్లకు మొక్కుతారా? అని ఈ వీడియో చూపిస్తారు.

A Mother And Daughter Story-

వీటన్నింటిని తెలుసుకొని ఓ పెద్దమనిషి పెద్ద మనసుతో రంగంలోకి దిగాడు… అల్లుడు,కూతుర్ని దీని గురించి అడిగితే, నువ్వెవరు అన్నట్టు చూశారు. గోదారమ్మ ను కలిసాడు..అమ్మా మీరు ఓ కంప్లైంట్ రాసివ్వండి వీళ్ళ పనిచెబుదాం అంటే దానికి ఆమె ఇచ్చిన సమాధానం.. అల్లుడు, కూతుర్ని ఏం అనొద్దు… నేను కష్టపడి కొనుకున్న ఇల్లు నాకు వస్తే చాలు. ఇది తల్లి ప్రేమంటే, కానీ అలాంటి తల్లినే చెప్పుకోలేని చిత్రహింసలకు గురిచేసింది సొంత కూతురు.

ఈ ఇష్యూ మీద సోషల్ మీడియా మద్దతును కూడగడుతూ..ప్రత్యక్ష కార్యచరణకు శ్రీకారం చుట్టి…. గొదారమ్మ సొంత ఇంటినుండి కూతురు, అల్లుడిని బయటికి పంపించేదాకా అలుపెరుగని పోరాటం చేశాడు ఓ పెద్దమనిషి…ఈ విషయంలో పోలీసులు సైతం అల్లుడు, కూతుళ్ల వైపు ఉన్నప్పటికీ అసలు వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తూ పదిహేను రోజులుగా ఫేస్ బుక్ పోరాటం చేస్తూ చివరికి సక్సెస్ అయిన ఆ పెద్దమనిషి పేరు వాసిరెడ్డి వేణుగోపాల్. మనచుట్టూ ఎన్నో జరుగుతున్నా ఆ…మనకెందుకులే అనుకునే మన తత్త్వానికీ, 75 యేళ్ళ వృద్దురాలి బాధను తన బాధగా తలచుకొని… పరిష్కరించేదాకా వెనుకడగువేయని ఆ పెద్దమనిషి యిజానికి చాలా తేడా ఉంది కదా!