ఆ లీటర్ వాటర్ బాటిల్ ధర 65 లక్షలు తెలుసా.? దానిలో అంత స్పెషల్ ఏంటి.? అంత ధర ఎందుకు?     2018-08-14   10:52:24  IST  Sai Mallula

వాటర్ బాటిల్ మనం కొనడం చాలా అరుదు. మరి అత్యవసరం అనుకుంటేనే కొంటాం. ఏ రైల్వే స్టేషన్ లోనో లేకుంటే బస్సు స్టాప్ లోనో. మహా అంటే ఓ బాటిల్ కి ఇరవై రూపాయలు చెల్లిస్తాము. ఇక సెలెబ్రిటీలు తాగే నీళ్లు కొన్ని వేళల్లో ఖరీదు కూడా ఉంటుంది అది వేరే విషయం అనుకోండి. కానీ ఒక వాటర్ బాటిల్ 65 లక్షలు అంటే నమ్మగలమా? కానీ నమ్మక తప్పట్లేదు? అంత స్పెషల్ ఏంటి? అంత ధర ఎందుకు? వివరాలు చూడండి!

A Luxury Water Bottle Worth Rs 65 Lakh Is Going To Hit Indian Markets-

A Luxury Water Bottle Worth Rs 65 Lakh Is Going To Hit Indian Markets

అమెరికాకు చెందిన “Beverly Hills” అనే పానీయాల కంపెనీ త్వరలో భారత మార్కెట్లో అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా లగ్జరీ వాటర్ బాటిళ్లను తీసుకురావాలని నిర్ణయించింది. 90H2O పేరుతో ఓ వాటర్ బాటిల్ రిలీజ్ చేయనుంది. దాని ధర అక్షరాల అరవై ఐదు లక్షల రూపాయలు. దీనికి ఎందుకు అంత ధరంటే.. ఇందులోని నీటిని దక్షిణ కాలిఫోర్నియాలోని పర్వత ప్రాంతాల్లో 5500 అడుగుల ఎత్తునుంచి పడుతుంటే సేకరిస్తారు.

A Luxury Water Bottle Worth Rs 65 Lakh Is Going To Hit Indian Markets-

ఈ నీరు చాలా స్వచ్చంగా, గమ్మత్తయిన రుచితో అద్భుతంగా ఉంటుందని బేవెర్లీ హిల్స్ కో ఫౌండర్ జాన్ గ్లుక్ తెలిపారు. ఇక ఈ బాటిల్ కూడా ప్రత్యేకమే. బాటిల్‌పై అరుదైన వజ్రాలు పొదిగారు. మూతను ప్లాటినంతో తయారు చేశారు. బాటిల్‌పై మొత్తం 14 కేరెట్ల విలువైన 250 నల్ల వజ్రాలను పొదిగారు. అయితే ఈ బాటిల్ అందరికి అందుబాటులో ఉండదు. లైఫ్‌స్టైల్ ఎడిషన్‌లో భాగంగా వీటిని పరిమితంగా విక్రయించనున్నారట. అంతేకాదండోయ్.. ఈ కంపెనీ ‘వరల్డ్స్ బెస్ట్ వాటర్ అవార్డు’ కూడా అందుకుంది.