డస్టర్ కోసం కిందకి వంగితే హై స్కూల్ స్టూడెంట్స్ నా నడుము వైపు. ఓ టీచర్ పంపిన ఈ మెసేజ్ చూస్తే కన్నీళ్లే!

నేనొక టీచర్ !
నా వృత్తి అంటే నాకు ఎంతో ఇష్టం !
నా పిలల్లు అంటే నాకు ఎంతో ప్రేమ !!
నా పిల్లలకు నేనంటే ఎంతో గౌరవం !
కానీ ఇప్పుడదంతా గతం !
ప్రతి రోజు నాకిప్పుడు భయం భయం !
పిల్లలలు దేవుడు చల్లని వారే కల్లకపట మెరుగని కరుణామయులే !
ఇది గతం !!

 A Lady Teacher Message Goes Viral-TeluguStop.com

టీవీ లు, ఇంటర్నెట్ , బిజీ లైఫ్ తల్లితండ్రులు , అంత కలిసి తెలిసో తెలియకో పిల్లల మనసు కల్మషం చేసేసారు !

ఇప్పుడు నాకు స్కూల్ కు పోతున్నట్టు లేదు !
పాఠం చెబుతుంటే నా నడుము వైపు హై స్కూల్ పిల్లాడి చూపు !
డస్టర్ కోసం వంగి తీసే లోపే ఏదో పది కళ్ళు నన్ను తినేసేలా చూశాయని ఫీలింగ్!

క్లాస్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఏదో లోకం లో వుంటారు !
ఆరవ తరగతి నుంచే జంటలు జంటలు !
మొన్న బాత్ రూమ్ లో ఇద్దరు పిల్లలు ముద్దులాడు కొన్నారని మా సోషల్ టీచర్ చెబితే మనకెందుకు తెలిస్తే గొడవ లవుతాయని ప్రిన్సిపాల్ దాపరికం !

15 ఏళ్ళ అనుభవం ! నా పాఠాన్ని పిల్లలు ఎంతో శ్రద్ధగా వినేవారు !
ఇప్పుడు పరిస్థితి వేరు .లెసన్ ఎంత ఇంటరెస్టింగ్ గా చెప్పిన వినని పిల్లలు !
అర్ధరాత్రి దాకా మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడిన వారు , నీలి చిత్రం చుసిన వారు .చాటింగ్ చేసిన వారు .
క్లాస్ రూమ్ లో కూర్చొంటే అదో లోకం లో వున్నా అధిక శాతం పిల్లలు .

పరీక్ష వస్తే తల్లితండ్రులకు మార్కు లు కావాలి .
లేదంటే PTA మీటింగ్ లో పిల్లల ముందే అమ్మ నా బూతులు.
పిల్లడు చదువు పై శ్రద్ధ చూపడం లేదంటే నీకే చేత కాదు అని క్లాస్ లో అందరు తల్లితండ్రులకు ఎదురుగా అవహేళన .
సపోర్ట్ కోసం ప్రిన్సిపాల్ వైపు చుస్తే తలా దించుకొని ఆయన!

హోమ్ వర్క్ ఇవ్వొద్దు .కనీసం పాఠం చదువు కొని రమ్మంటే పట్టించుకోని పిల్లలు !
క్లాస్ లో అదేమని అడిగితె నువ్వు తిడుతున్నావని మా నాన్న కు చెబుతా ఆయన మీడియా కు చెబుతాడు అని పిల్లాడి హుంకరింపు !
మొన్న పక్క స్కూల్ లో ఇదే జరిగింది ! పిలల్ల ప్రవర్తన శృతి మించితే టీచర్ కాస్త గా గట్టిగ కోప్పడి కాసేపు నిల్చోమందఁట !
ఇక మరుసటి రోజు టీవీ లో బ్రేకింగ్ వార్తలు ! టీచర్ ను రాక్షసుడిగా చిత్రీకరణ !
ఒక రోజు జైలు లో గడిపిన ఆ టీచర్ .రెండు నెలల జీతం ఖర్చు పెడితే కష్టం మీద బెయిల్
మరో పక్క ప్రిన్సిపాల్ ను స్కూల్ లోనే చంపిన వార్తలు ! నా భవిష్యత్తు తలచుకొంటే నాకే భయం !
నాకు ఒక కుటుంబం వుంది ! ఇంట్లో భర్త పిల్లలు వున్నారు !
ఇంట్లో నుంచి స్కూల్ కు వచ్చినప్పుడు ఇంటికి క్షేమం తిరిగి పోతానని లేదు గారెంటీ !
జైలు కె పోతానో .నా శవమే తిరిగి పోతుందో .

బాలలోకాన్ని అందరు చేసారు కల్మషం .బాగు చెయ్యాల్సింది టీచర్ లే నట !
మాకెందుకు ఈ మూళ్ళ కిరీటం !
లేదు నేడు ఈ వృత్తికి గౌరవం .
లేదు నేడు ఈ వృత్తికి ఆదరణ
బతికుంటే బలుసాకు తినొచ్చు .
బతక లేక పోయినా బడి పంతులు గా
రావొద్దు అని అందరికి చెబుతా !

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube