ఒక మగవాడి ఆవేదన …తప్పక చదవండి..!     2018-08-22   09:12:11  IST  Sai Mallula

నా స్నేహితుడు అనుభవించిన కొన్ని మరచిపోని, చెరగని చేదు జ్ఞాపకాలు తన అనుమతిన మీ ముందుకు తీసుకువస్తున్నాను… చదివిన తరువాత మనం “మగ వాళ్ళం, మనమే గొప్ప” అనుకునే పురుష పుంగవులలో ఒక్కరైనా మారుతారనే ఆవగింజంత నమ్మకంతో ఓపిక లేకున్నా ఈ పోస్ట్ పెడుతున్నాను… ఈ “ఒక మగవాడి ఆవేదన … ” శీర్షిక చూసి స్త్రీ మూర్తులు వేరేలా అనుకోవద్దు… నిరభ్యంతరంగా, నిర్మొహమాటంగా, నిరంకుశంగా చదవండి….

నా స్నేహితుడు తన తల్లి, తండ్రిని ఎంతో ప్రేమిస్తాడు…తనకు పెండ్లి ఐంది.. పిల్లలు కూడా వున్నారు.. అయినా ఎంతో ప్రేమానురాగాలతో వాళ్ళను కంటి పాపలుగా చూసుకుంటాడు… తన భార్య మాత్రం నామమాత్రంగానే వ్యవహరిస్తుంటుంది… అయినా తను వాటిని ఖాతరు సెయ్యక తన పని చూసుకుంటూ వెళ్తాడు…

ఒకరోజు తన తల్లి కాలు జారి మెట్లు దిగుచున్న సమయంలో పడిపోయారు.. అలా పడిన ఆమె కోమాలోకి వెళ్ళిపోయారు.. తన తల్లిని ఆ స్థితిలో చూసిన అతను ఎంతో కృంగిపోయాడు.. తన తండ్రి కూడా ఎంతో బాదలో వున్నాడు… కాకపోతే ఇప్పుడు సమస్యల్లా ఆ తల్లికి సేవ చెయ్యడమే…

A Doctor About Women Greatness-

A Doctor About Women Greatness

ఆ తల్లి భర్తకు చెయ్యాలని వున్నా చేసే శక్తి లేదు…. తన కొడుకు నేను వున్నాలే నాన్న మీరు దిగులు పడకండి అని ధైర్యం చెప్తాడు… నా స్నేహితుని భార్య తన మనసులో కూడా బాద వున్నా తనకు అలా సేవ చెయ్యాలన్న మనసు లేదు.. అందుకే తనని నా స్నేహితుడు అడగకముందే తనే చెప్పేస్తుంది నా వల్ల కాదు నన్ను ఈ పనికి పిలవద్దు అని… ఆ మాటకు తను ఎంతో కృంగిపోయి ఉంటాడు..

ఇంక ఎలా ఐతే అలా ఐంది అని అనుకోని హాస్పిటల్ కి వెళ్తాడు.. అక్కడ ఒక డాక్టర్ వేసిన ప్రశ్నకు తను కంటి నిండా నీరుతో తలవంచుకోలేక తప్పలేదు…

డాక్టర్ – మీ అమ్మగారిని చూసుకోవడానికి ఒక స్త్రీ ని ఎవరినన్నా తీసుకొని రమ్మని చెప్పాను ఎవరన్నా వచ్చారా ??

స్నేహితుడు – లేదు డాక్టర్ నేనే అమ్మకు అన్ని చేస్తాను.. ఆమె నా తల్లి జాగ్రతగా చూసుకుంటాను అని బదులిస్తాడు ..

డాక్టర్ – అవునా సరే అయితే నేను ఒకటి చెప్తాను అది మీరు చెయ్యగలరని మీరు అనుకుంటున్న పనిని చెయ్యగలరేమో చూద్దాం… మీ అమ్మగారికి బట్టలు మార్చాలి ఆమెను కొంచం వేడి వస్త్రం తో తిడిచి మరలా బట్టలు తొడగాలి.. మీరు ఇది చెయ్యగలరా ??

A Doctor About Women Greatness-

స్నేహితుడు – మౌనంగా తలవంచుకొని వున్నాడు… తన కంటి లోనుండి నీరు తన పాదాలపైనే పడటం డాక్టర్ గమనించి తన భుజంపై చెయ్యివేసి చూడు బాబు.. మగవాడు కొన్ని పనులకే పరిమితం అయ్యాడు.. కాని స్త్రీ మూర్తి ప్రతి పనికి ఆది దేవత లా వుంటుంది… అదే పరిస్థితిలో నీవుండి వుంటే నీ తల్లి చెయ్యగలదు… అంతటి గొప్ప శక్తి వంతురాలు కనుకనే మొదటగా ఆమెకు ప్రాధాన్యం ఇస్తారు… ప్రతి వర్ణన ప్రకృతికి ఏమాత్రం తగ్గకుండా పెద్ద పెద్ద దిగ్గజాలు స్త్రీ గురించి ఎంతో గొప్పగా వర్ణిస్తారు …

తల్లిలా, భార్యలా, సోదరిలా, అత్తయ్యలా, అవ్వలా, కూతురిలా, ఇలా విభిన్నమైన పాత్రలను చక్కగా తనదైన రీతిలో పోషించుచూ అందరికి అన్నీ తానే అయి చేస్తూ తనల్ని కాలితో తన గుండెలపై మనం తన్నినా కూడా కడుపులో పెట్టి చూసుకునే గొప్ప మూర్తి స్త్రీ మూర్తి…

ఒప్పుకుంటాను కొందరు మరోలా వున్నారని వారి ఆహార, వస్త్ర, ప్రవర్తన విషయంలో మార్పులు వున్నాయని… కాని అందరూ కాదు కేవలం కొందరు మాత్రమే అని మనం గ్రహించాలి… వెలుగు, చీకటి రెండూ ఉన్నట్లే మంచి, చెడు అనే రెండు వేరేవేరే మనస్తత్వం కలిగిన వారు వున్నారు… అలా వున్నారు కనుకే ఏది మంచి, ఏది చెడు అనే భావన మనకు కలిగి మనం ఏ దారిని ఎంచుకోవాలో మనకు ఒక నిర్దేశమైన దారి ఏర్పడి మనం అందులో పయనించే అవకాసం వుంటుంది…

ఇప్పుడు చెప్పండి మిత్రులారా ఎవరు గొప్ప… ఆపద సమయంలో నిలిచే వారే నిజమైన గొప్పవారు.. స్త్రీ లేనిదే సృష్టే లేదు..

జీవితంలో మోసపోయిన మహిళ తన సమస్యలను ధైర్యంగా పోరాడగలిగిన రోజున వరకట్న చావులు, బలవన్మరణాలు వుండవు…. అలాంటి ఒక రోజు వచ్చిన వేల ఈ లోకంలో మేము, మగవాల్లలానే సమానం అని స్త్రీ గర్వంగా వెలుగెత్తి చూసిన రోజున ఈ జన్మభూమి ఎంతో పునీతం అవుతుంది….