ఆవిడ వయసు 70ఏళ్లు..ఈ వయసులో కూడా 4కిమీ సైకిల్ పై ప్రయాణిస్తూ గడ్డిమోపు తెచ్చి, అమ్ముతూ జీవనం సాగిస్తుంది..   70 Years Old Woman Yalamandamma Cycling For 4 Km Daily     2018-09-18   12:35:59  IST  Rajakumari K

70ఏళం వయస్సు వాళ్లు ఏంచేస్తారు? ఇంట్లో ఓ మూలన కూర్చొని టివీ చూస్తూ, టైమ్ కు BP, షుగర్ ట్లాబ్లెట్స్ వేసుకుంటూ, హరీ, రామా అంటూ దేవుడి నామస్మరణ చేసుకుంటూ,మనుమలతో ఆడుకుంటూ కాలం వెల్లదీస్తుంటారు.కానీ గుంటూరుకు చెందిన యల్ల మందమ్మ అందరిలా కాదు….డెభ్బై ఏళ్ల వయసులో కష్టించేతత్వాన్ని వదులు కోలేదు.. మలి వయసులో కడుపున పుట్టినవారు తనకి తోడుగా ఉండాలని ఆలోచించలేదు..తన కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నది..

యల్ల మందమ్మ 70 ఏళ్ల వయస్సులో…. తెల్లవారగానే లేచి, అన్నం వండుకొని, ఇంత తిని, ఇంత సద్ది కట్టుకొని….సైకిలెక్కి ఓ నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి…అక్కడున్న గడ్డికోసి, మోపు కట్టుకొని, సైకిల్ మీద వేసుకొని…మళ్లీ 4 KM వచ్చి…ఊర్లో తిరిగి, ఆ గడ్డిమోపును 100 రూపాయలకు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. యల్ల మందమ్మ ప్రతి రోజు ప్రయాణించే నాలుగు కిలోమీటర్లలో దాదాపు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం సరిగ్గా ఉండదు. ఆ రెండు కిలో మీటర్లు..రైల్వే ట్రాక్ మీద నడవాల్సిందే…. సాధారణంగా రైల్వే ట్రాక్ మీద మనుషులు నడవడమే కష్టం…అలాంటిది…మందమ్మ… 70 ఏళ్ల వయస్సులో సైకిల్ మీద గడ్డిమోపు పెట్టుకొని పోనూ 2 KM, రాను 2KM అదే ట్రాక్ మీద సైకిల్ గడ్డిమోపుతో నడుచుకుంటూ వస్తుంది. నాలుగేళ్లుగా ఇలా చేస్తూ తాను సంపాధించిన డబ్బుతో జీవనం సాగిస్తుంది మందమ్మ.

70 Years Old Woman Yalamandamma Cycling For 4 Km Daily-

యవ్వనంలో ఉండి సోమరులుగా తయారవుతున్న యువకులకు, అన్ని అవయవాలు సరిగ్గా ఉండి బిఛ్చమెత్తుకుంటున్న చేతకాని వాళ్లకు యల్ల మందమ్మ జీవితమే ఒక పాఠం.. కూర్చొని చేసే పనుల్లోనే 56-60 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంటున్న ఈ రోజుల్లో…70 ఏళ్ల వయసులో కూడా ఇంకా కష్టించేతత్త్వం మారని ఆ మట్టిమనిషికి నిజంగా వేలవేల దండాలు…