యాంకర్ సుమ గురించి ఈ 10 ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా.?

సుమ కనకాల.తెలుగు టెలివిజన్ రంగంలో మకుటం లేని మహరాణి.

 10 Interesting Facts About Anchor Suma-TeluguStop.com

యాంకరింగ్ రంగంలో తనదైన శైలిలో ఎన్నో ఏళ్లుగా దూసుకుపోతుంది.స్పాంటేనియస్ గా పంచ్ లు వేయడంలో సుమ తర్వాతే ఎవరైనా.

అందుకే చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ సుమని అభిమానిస్తారు.ఒకవైపు టివి ప్రోగ్రాములు,మరోవైపు ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సుమ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

1.సుమ 1975 మార్చి 22న జన్మించారు.2018 మార్చి 22 నాటికి 43 సంవత్సరాలు వచ్చాయి.ఆమెది అసలు కేరళ.

ఆమె తండ్రి పేరు పిఎన్ కుట్టి, తల్లి పేరు పి.విమల.సుమ చిన్న వయసులో ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు కేరళ నుంచి సికింద్రాబాద్ వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు.సుమ వాళ్ల ఫాదర్ రైల్వే ఎంప్లాయ్.

2.సుమ తెలుగు స్పష్టంగా మాట్లాడడం వెనుక అసలు కారణం వాళ్లమ్మ.ఆవిడే సుమకి తెలుగు నేర్పించారు.అంతేకాదు స్కూల్‌లో ఉన్నప్పుడు సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగు తీసుకునేలా ఎంకరేజ్ చేశారు.అదే ఇప్పుడు సుమకు అడ్వాంటేజ్ అయింది.

3.సికింద్రాబాద్ తార్నాకలోని సెయింట్ ఆన్స్ కాలేజీలో ఇంటర్ చదువింది.మొదట బైపీసీ తీసుకుని తర్వాత ఆర్ట్స్ గ్రూప్ లోకి మారి,ఇంటర్ పూర్తైన తర్వాత రైల్వే డిగ్రీ కాలేజీలో బీకామ్‌లో చేరింది.

తర్వాత కరెస్పాండెన్స్లో ఎంకామ్ పూర్తి చేసింది.

4.సుమ చిన్నప్పుడే డ్యాన్స్ నేర్చుకున్నారు.సికింద్రాబాద్‌లో ఆనంద్ శంకర్ అనే గురువు దగ్గర భరత నాట్యం, భద్ర అనే గురువు దగ్గర కూచిపూడి నేర్చుకుంది.

ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది.ఓసారి రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవంలో సుమ డ్యాన్స్ ప్రదర్శన చూసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు ఆమెను చూసి దూరదర్శన్ సీరియల్ పెళ్లిచూపులులో నటించాలని అడిగారు.

అప్పుడు సుమ వయసు 16 సంవత్సరాలు.అలా ఆమె నటనా కెరీర్ మొదలయ్యింది.

5.పెళ్లిచూపులు సీరియల్ తర్వాత పలు దూరదర్శన్ సీరియళ్లలో నటించారు.ఆ సమయంలో రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ ‘మేఘమాల’ అనే సీరియల్‌ తీశారు.ఇందులో సుమతో పాటు రాజీవ్ కూడా నటించారు.అప్పుడే వారిద్దరి మధ్య పరిచయమై ప్రేమగా మారింది.

6.1999 ఫిబ్రవరి 10న రాజీవ్ కనకాలతో సుమకు వివాహమైంది.పెళ్లి సమయానికి సుమ వయసు 24 సంత్సరాలు.


7.పలు సీరియల్స్లో నటించిన తర్వాత యాంకరింగ్ వైపొచ్చింది సుమ.21 సంవత్సరాల వయసులో 1996లో సుమ యాంకరింగ్ మొదలుపెట్టగా 1996లో కళ్యాణప్రాప్తిరస్తు అనే సినిమా ద్వారా మూవీల్లోకి ఎంటరయింది.ఆ సినిమాలో వక్కంతం వంశీ హీరో గా నటించారు.

ఆ సినిమా తర్వాత హీరోయిన్ గా నటించనప్పటికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడపాదడపా నటిస్తునే ఉంది.

8.సుమ,రాజీవ్ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు.కొడుకు పేరు రోషన్, కూతురు పేరు మనస్విని.

కొడుకు రోషన్ పుట్టే సమయానికి రాజీవ్‌కు 27 సంవత్సరాలు.

9.2010లో టీవీ9లో పంచవతారం ప్రోగ్రామ్‌కు బెస్ట్ నంది అవార్డు వచ్చింది.అదే ఏడాదిలో స్టార్ మహిళకు బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది.

స్టార్ మహిళ 2000 ఎపిసోడ్‌లు పూర్తి చేసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు దక్కించుకుంది.జీటీవీలో లక్కుకిక్కు అనే ప్రొగ్రామ్‌ను, ఆరుగురు అత్తలు అనే సీరియల్‌ను ఆమె స్వయంగా ప్రొడ్యూస్ చేశారు.

10.పిల్లలు పుట్టాక కొద్ది రోజులు యాంకరింగ్ కి దూరమైంది సుమ.ఆ తర్వాత మళ్లీ వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించింది.కాని అవకాశాలు రాలేదు.

దాంతో మళ్లీ విజయవాడ వెళ్లి అక్కడ లోకల్ ఛానెల్లో ప్రోగ్రామ్స్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగింది.అలాకాకుండా తన మామ దేవదాస్ కనకాల,భర్త రాజీవ్ కనకాల పేర్లు ఉపయోగించి ఇక్కడే అవకాశాలు సంపాదించొచ్చు.

సులభమైన లిఫ్ట్ మార్గముండగా,కష్టమైన మెట్లదారినే ఎంచుకుంది.అందుకే అంటారు కృషితో నాస్తి దుర్భిక్షం అని…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube