యూకే: నాలుగే రోజుల్లో కరోనాపై గెలిచిన 98 ఏళ్ల భారత బామ్మ, వైద్యుల ఆశ్చర్యం

ప్రపంచదేశాలను ముప్పు తిప్పలు పెడుతున్న కరోనా ఇప్పటి వరకు లక్షలాది మందికి సోకగా, మరణాల సంఖ్య లక్షకు చేరువలో ఉంది.ప్రపంచంలోని మేధావులంతా ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనుక్కొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

 Uk, 98 Year Old Woman, Coronavirus, Corona Effect Uk, Immunity Power-TeluguStop.com

ఈ రక్కసికి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నాయి.ముఖ్యంగా చిన్నారులు, పెద్దలకు దీని ముప్పు ఎక్కువగా ఉంది.

ఇలాంటి పరిస్ధితుల్లో భారత సంతతికి చెందిన బామ్మ గారు అద్భుతం సృష్టించారు.ఏకంగా 98 ఏళ్ల వయసులో కరోనా నుంచి కోలుకుని వైద్యులను ఆశ్చర్చపరిచారు.

కేరళలోని కొచ్చిలో జన్మించిన డఫ్నే షా వయసు 98 సంవత్సరాలు, వచ్చే జూలైతో 99వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు.ఈ క్రమంలో గత గురువారం ఆమెలో కోవిడ్ లక్షణాలు కనిపించాయి.

శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరగడంతో పాటు విపరీతమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో వెంటనే ఆమెను డుండీలోని నైన్‌వెల్స్ ఆసుపత్రికి తరలించారు.

Telugu Coronavirus, Immunity-

ఆమెను పరీక్షించిన వైద్యులు కరోనా సోకినట్లు నిర్థారించారు.వృద్ధురాలు కావడంతో వైద్యులు సైతం ఆమె కోలుకుంటుందా లేదా అన్న అనుమానం వ్యక్తం చేశారు.అయితే విచిత్రంగా నాలుగంటే నాలుగే రోజుల్లో డఫ్నే షా వైరస్‌ను ఓడించి స్కాట్లాండ్‌లోని తన ఇంటికి చేరుకున్నారు.

అనంతరం డఫ్నే మాట్లాడుతూ… తన బాగోగులను ఇప్పుడు కుమారుడు చూసుకుంటున్నాడని, తానిప్పుడు బాగానే ఉన్నానని చెప్పారు.జూలైలో బర్త్‌డే వేడుకలు జరుపుకోబోతున్నానన్న ఆలోచన బాగుందన్న డఫ్నే.పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పలేనన్నారు.కాగా 98 ఏళ్ల వయసులో కరోనా నుంచి కోలుకుని ప్రజలందరికీ స్ఫూర్తిగా నిలిచిన డఫ్నే ప్రస్తావన స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ సర్జన్ నిర్వహించిన కరోనా వైరస్ అప్‌డేట్‌ కాన్ఫరెన్స్‌లో చర్చకు వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube