'మీ టూ' అంటూ ఉద్యమం చేస్తున్న 'చిన్మయి' కి అనుకోని ట్విస్ట్.! 96 నే చివరి సినిమా అంట.

డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌, సింగ‌ర్ చిన్మ‌యి సౌత్‌లో మీటూ ఉద్య‌మాన్ని ఉదృతం చేసిన సంగతి తెలిసిందే.ఆమెకి స‌మంత‌, ర‌కుల్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు మ‌ద్ద‌తుగా నిలిచారు.

 96 Movie May Be Chinmayis Last Film-TeluguStop.com

ప్ర‌ముఖ ర‌చ‌యిత వైర‌ముత్తు స‌మాజంలో మంచి వ్య‌క్తిగా గుర్తింపు తెచ్చుకుంటూ అస‌భ్యక‌రంగా ప్ర‌వ‌ర్తించేవాడ‌ని, లిరిక్స్ గురించి వివ‌రించే స‌మ‌యంలో కౌగిలించుకోవ‌డం, వెకిలి చేష్ట‌లు చేయ‌డం వంటి చేసేవాడని చిన్మ‌యి ఇటీవ‌ల త‌న ట్వీట్‌లో తెలిపింది.వైర‌ముత్తుతో పాటు లైంగికంగా వేధించిన ప‌లువురు ప్ర‌ముఖుల పేర్లు కూడా బ‌హిర్గ‌తం చేసింది.

అయితే తాజాగా చిన్మయిని తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి తప్పిస్తూ త‌మిళ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాజా ఆదేశాలు జారీచేశారు.

ఈ విషయాన్ని చిన్నయి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.తనను డబ్బింగ్‌ యూనియన్‌నుంచి తొలగించారని ప్రకటించారు.అయితే ఈ రెండు సంవత్సరాలుగా తన డబ్బింగ్‌ ఫీజులోంచి 10శాతం ఎందుకు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు.

తనపై వేటు నిర్ణయం కొనసాగితే, తమిళంలో 96లాంటి మంచి సినిమాలో హీరోయిన్‌ త్రిషకు చెప్పిన డబ్బింగ్‌ చివరిది అవుతుందని ఆమె ట్వీట్‌ చేశారు.ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తన సభ్యత్వాన్ని తొలగించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

అలాగే డబ్బింగ్‌ యూనియన్‌ ద్వారానే తనపై తొలి వేటు తాను ముం‍దే అంచనా వేశానన్నారు.ఆరోపణలు వచ్చిన రాధారవిపై ఎలాంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

అటు ఈ పరిణామంపై నటి మంచు లక్ష్మి కూడా స్పందించారు.

ఇది ఇలా వుంటే ఈ ప్రమాదాన్ని చిన్మయి ముందే ఊహించారు.తమిళ సినీ రంగంలో పేరొందిన నటుడు, యూనియన్‌ అధ్యక్షుడు రాధా రవి కారణంగా తన డబ్బింగ్‌ కరియర్‌ ప్రమాదంలో పడనుందంటూ అక్టోబర్‌ 9న ఒక ట్వీట్‌ చేయడం గమనార్హం.మరోవైపు గత రెండు సంవత్సరాలుగా డబ్బింగ్‌ యూనియన్‌కు చెల్లించాల్సిన సభ్యత్వ రుసుమును చెల్లించకపోవడమే ఇందుకు కారణంగా వివరించారు.

మరి ఇన్నిరోజులుగా పలు సినిమాలకు చిన్మయి డబ్బింగ్‌ ఎలా చెప్పింది అన్న ప్రశ్నకు స్పందించిన సంఘం.కేవలం పేరున్న ఆర్టిస్ట్‌ అన్నగౌరవంతోనే ఆమెకు మినహాయింపు నిచ్చినట్టు చెప్పుకొచ్చారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube