జానులో జూనియర్ సమంత గౌరీ హీరోయిన్ గా ఎంట్రీ

సమంతా, శర్వానంద్, లీడ్ రోల్ లో వచ్చిన సినిమా జాను. ఈ మూవీ తమిళంలో 96 టైటిల్ తో విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్ లో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది.

 96 Gouri Kishan Debuts As Heroine In Telugu-TeluguStop.com

దీంతో దిల్ రాజు అదే దర్శకుడిని తీసుకొచ్చి తెలుగులో జాను టైటిల్ తో రీమేక్ చేయించారు.అయితే తెలుగులో మాత్రం ఫలితం నిరాశాజనంగా వచ్చింది.

ఫీల్ గుడ్ మూవీగా అనిపించినా ఎందుకనో ఆడియన్స్ కథకి సింక్ కాలేకపోయారు.దీంతో మూవీ డిజాస్టర్ అయ్యింది.

 96 Gouri Kishan Debuts As Heroine In Telugu-జానులో జూనియర్ సమంత గౌరీ హీరోయిన్ గా ఎంట్రీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తమిళ్, తమిళ్ బాషలలో జూనియర్ త్రిష, సమంత పాత్రలలో గౌరీ కిషన్ అనే బ్యూటీ నటించింది.టీనేజ్ గర్ల్ గా ఈ అమ్మడు సినిమాలో ఎక్కువ సమయం కనిపించి తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులోకి హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తుంది.సంతోష్ శివన్ కి జోడీగా గౌరీ కిషన్ నటించబోతుంది.

ఇప్పటికే తమిళ్ లో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇప్పుడు తెలుగులో తెరంగేట్రం చేయబోతుంది.

మెగాస్టార్ కూతురు సుస్మిత నిర్మాణంలో తమిళ్ హిట్ మూవీ 8 తొట్టకల్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తుంది.ఒరిజినల్ తెరకెక్కించిన దర్శకుడు శ్రీ గణేష్ తెలుగు వెర్షన్ కి కూడా పని చేస్తున్నాడు.

ఇక ఈ మూవీలో సంతోష్ శోభన్ కి జోడీగా గౌరీ కిషన్ నటించబోతుంది.త్వరలో ఈ మూవీ పట్టాలు ఎక్కుతుంది.

మొత్తానికి ఏక్ మినీ కథ సూపర్ హిట్ తో కుర్ర హీరో సంతోష్ ఏకంగా మెగా కాంపౌండ్ లోకి వచ్చి పడటం నిజంగా విశేషం అని చెప్పాలి.

#Gouri Kishan #GouriKishan #Santosh Sobhan #Samantha #'96'Gouri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు