అన్ని జబ్బులు ఉన్నా.. కరోనాను జయించిన 92 ఏళ్ల బామ్మా.. సీక్రెట్ ఏంటంటే?

కరోనా వైరస్ కు చిన్న పెద్ద అని తేడా లేకుండా కొంచం నిర్లక్ష్యంగా ఉన్నా.శానిటైజర్, మాస్కు ఉపయోగించకుండా కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా సరే కరోనా వ్యాపిస్తుంది.

 92year Old Woman Recovered From Corona, Bp, Diabetes, Doctors Help,92 Year Old W-TeluguStop.com

యువతీ యువకులకు కరోనా వైరస్ సోకినప్పటికీ అతి తక్కువ సమయంలోనే చికిత్స తీసుకొని కోలుకుంటున్నారు.అదే వృద్దులకు కరోనా వ్యాపిస్తే చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

వృద్దులకు, ఆల్రెడీ జబ్బు పడిన వారికి కరోనా వైరస్ ముప్పు ఎక్కువ ఉంది.ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన 92 ఏళ్ల బామ్మ కరోనా భారిన పడింది.

ఈ నెల 6వ తేదీన బామ్మకు కరోనా పాజిటివ్ రాగ వెంటనే గుంటూరులోని శ్రావణి ఆస్పత్రికి తరలించారు.

దీంతో ఆ వృద్ధురాలికి ఆస్పత్రి వైద్యులు డాక్టర్ పోసాని శ్రీనివాసరావు శ్రద్ధ తీసుకొని వైద్యం చేశారు.

దీంతో రామానుజమ్మ వారం రోజుల్లోనే కోలుకొని తిరిగి ఇంటికి వెళ్లారు.అయితే 92 ఏళ్ళ వృద్ధురాలికి డయాబెటిస్, బీపీ ఉన్నప్పటికి ఆమె కేవలం వారం రోజుల వ్యవధిలోనే కోలుకోవడం ఆస్పత్రి వర్గాలను కూడా ఆశ్చర్యపడేలా చేసింది.

ఆలా త్వరగా కోలుకోవడానికి అక్కడ డాక్టర్ పోసాని శ్రీనివాసరావు తీసుకున్న జాగ్రత్తలే కారణం అని ఆస్పత్రి సిబ్బంది చెప్తుంది.కాగా కరోనా వైరస్ ను ఎవరు నిర్లక్ష్యం చెయ్యొద్దని అలాగని కరోనా వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు అని డాక్టర్ పోసాని శ్రీనివాసరావు చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube