90'స్ గ్యాంగ్ తో రచ్చ చేస్తున్న వెటరన్ హీరోయిన్లు...

తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, తదితర స్టార్ హీరోల సరసన నటించి ఎంతగానో అలరించిన ప్రముఖ హీరోయిన్ “మీనా” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన మీనా పెళ్లయిన తర్వాత సినిమా పరిశ్రమకు దాదాపుగా పూర్తిగా దూరమైంది.

 90s Tamil Actors Reunion Party Photo Viral-TeluguStop.com

దీంతో తన కుటుంబం బాధ్యతలను చక్కబెట్టే పనిలో పడిన మీనా అడపాదడపా చిత్రాలలో కనిపిస్తూ అలరించినప్పటికి ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేక పోతోంది.

అయితే ఈ మధ్యకాలంలో మీనా సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

 90s Tamil Actors Reunion Party Photo Viral-90’స్ గ్యాంగ్ తో రచ్చ చేస్తున్న వెటరన్ హీరోయిన్లు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా 90’స్ లో సినిమా పరిశ్రమకు నటీనటులుగా పరిచయమై అదరగొట్టిన తమిళ సినీ నటులు కలిసి రీ యూనియన్ పార్టీలో సందడి చేసిన సమయంలో తీసిన ఫోటోలను మీనా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.అయితే ఈ వేడుకలో హీరో సూర్య, జ్యోతిక, రోజా, సంగీత, ఏ ఆర్ రెహమాన్, విజయ్, అరవింద స్వామి, సిమ్రాన్, జయ రామ్, సంఘవి, అలాగే తమిళ ప్రముఖ దర్శకుడు శంకర్ మరియు ఇతర నటీనటులు పాల్గొన్నారు.

కాగా ఈ ఫోటోకి “ది 90’స్ స్టిల్ రాకింగ్” అనే క్యాప్షన్ కూడా పెట్టింది మీనా.దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఆ మధ్య తెలుగులో “దృశ్యం” చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన మీనా ప్రస్తుతం వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తూ బాగానే అలరిస్తోంది.అయితే తాజాగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “లూసిఫర్” చిత్రంలో మీనా చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.కానీ ఇప్పటివరకు మీనా మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.

#Ar Rehman #Suriya #90'sTamil #Meena #Jyothika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు