పనోడితో ఆంటీ తో కులుకుతుండగా యజమానురాలు చూసిందని...

ఈ మధ్యకాలంలో కొందరు అవగాహన రాహిత్యం మరియు విచక్షణ కోల్పోయి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా కటకటాల పాలవుతున్నారు.కాగా తాజాగా పని చేయడానికి వెళ్లి తనతో పాటు పని చేయడానికి వచ్చినటువంటి మరో ఆంటీ తో అక్రమ సంబంధం పెట్టుకొని చివరికి ఆ విషయం కాస్త యజమానికి తెలియడంతో ఏకంగా యజమానిని దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.

 90 Years Old Woman Brutally Killed In Tamil Nadu For Money And Jewellery-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని ఓ గ్రామంలో 90 సంవత్సరాలు కలిగినటువంటి ఓ వృద్ద మహిళ తన పొలంలో ఉన్న ఇంటిలో నివాసముంటుంది.అయితే ఈ పొలంలో పని చేయడానికిగాను దగ్గరలో ఉన్న గ్రామం నుంచి వడివేలు అనే మహిళ, అలాగే సెళ్వీ అనే వ్యక్తి తరచూ వచ్చేవారు.

ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.దీంతో ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.దీంతో వీరిద్దరూ యజమానురాలు ఇంట్లో లేనప్పుడు ఏకాంతంగా కలుసుకుంటూ సరస సల్లాపాలు సాగించేవాళ్ళు.కాగా తాజాగా ఈ విషయం కాస్త యజమానురాలుకి తెలియడంతో వీరిద్దరిని పనిలో నుంచి తీసేసింది.

 90 Years Old Woman Brutally Killed In Tamil Nadu For Money And Jewellery-పనోడితో ఆంటీ కులుకుతుండగా యజమానురాలు చూసిందని…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో వీరిద్దరూ కలిసి యజమానురాలు పై కక్ష పెంచుకున్నారు.

ఈ క్రమంలో ఎలాగైనా ఆమెను అంతమొందించి ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం, నగలు, డబ్బు, కాజేయాలని పన్నాగం పన్నారు.

అయితే అనుకున్న విధంగానే ఇటీవలే యజమానురాలు ఒంటరిగా ఉండటంతో ఆమెపై దారుణంగా దాడి చేసి హతమార్చారు.అనంతరం బంగారం, డబ్బు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు.దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని దగ్గర ఆస్పత్రికి తరలించారు.అలాగే స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ దర్యాప్తులో భాగంగా వడివేలు సెల్విలను అదుపులోకి తీసుకుని విచారించగా తమ వివాహేతర సంబంధం ఎక్కడ బయట పడుతుందోనని తామే ఈ హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు.

#90Years #Tamil Nadu #90Years #ExtraMarital

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు