కిక్కిచ్చిన 90ML.. అక్కడ కాదు ఇక్కడ!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నాడు.కానీ సరైన హిట్టు మాత్రం పడటం లేదు.

 కిక్కిచ్చిన 90ml.. అక్కడ కాదు ఇక్కడ!-TeluguStop.com

దీంతో ఎంచుకునే సబ్జెక్టులను చాలా జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చూసుకుంటున్నాడు ఈ హీరో.ఇక కార్తికేయ నటించిన చివరి సినిమా 90ML పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన సంగతి తెలిసిందే.

యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌గా వచ్చిన 90 ఎంఎల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యింది.

 కిక్కిచ్చిన 90ML.. అక్కడ కాదు ఇక్కడ!-కిక్కిచ్చిన 90ML.. అక్కడ కాదు ఇక్కడ-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శేఖర్ రెడ్డి అనే దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్ రోజునే మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో టోటల్ రన్‌లో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ మూవీగా నిలిచింది.

కంటెంట్‌లో కొత్తదనం ఉన్నా, దాన్ని ఎలివేట్ చేసిన విధానం బాగా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.ఇక రీసెంట్‌గా ఈ సినిమాను టీవీలో ప్రసారం చేశారు.

అయితే అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఈ సినిమాకు టీవీ ప్రేక్షకులు మంచి రెస్పాన్స్‌ను కట్టబెట్టారు.ఈ సినిమా ప్రసారమైన స్టార్ మా ఛానల్‌కు 10.92 రేటింగ్ లభించింది.ఒక ఫెయిల్యూర్ సినిమాకు ఇంత రేటింగ్ రావడం నిజంగా విశేషమని చెప్పాలి.

కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమాలో నేహా సోలంకి హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమా సాధించిన రిజల్ట్‌తో కార్తికేయ తన నెక్ట్స్ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు.

ఏదేమైనా ఓ ఫెయిల్యూర్ సినిమాకు ఇలాంటి టీఆర్పీ రేటింగ్స్ రావడం అంటే అది ఖచ్చితంగా లాక్‌డౌన్ ప్రభావం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

#Rx #ML #Karthikeya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు