స్మార్ట్ ఫోన్ చూస్తూ నేరుగా వెళ్లి రైల్వే ట్రాక్ పై పడిపోయిన 9 ఏళ్ల బాలుడు

స్మార్ట్ ఫోన్స్ వల్ల పిల్లలు,పెద్దలు తమ ఎదురుగా వచ్చే ప్రమాదాలను సైతం గమనించలేకపోతున్నారు.ఇలాంటి ఒక ఘటనే రష్యా లోని యెకాటెరిన్బర్గ్‌లోని చకాలోవ్ స్కాయా స్టేషన్ లో చోటుచేసుకుంది.

 9 Yeras Boy Busy Playing Mobile Game Falls Off Train Platform-TeluguStop.com

ఒక తొమ్మిదేళ్ల బాలుడు తన టాబ్లెట్(స్మార్ట్ ఫోన్)లో గేమ్ ఆడుకుంటూ ప్లాట్ ఫామ్ మీద నడుస్తున్నాడు.అయితే ఆటలో మునిగిపోయిన బాలుడు ఎటు వెళుతున్నాడు అన్న విషయం కూడా గమనించకుండా నేరుగా ట్రాక్ వైపుకు నడిచాడు.

దీనితో అతడు కింద కూడా చూసుకోకపోవడం తో అతడు ప్లాట్ ఫామ్ మీద నుంచి ఒక్కసారిగా ట్రాక్ పైకి పడిపోయాడు.దీనితో ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనకు భయాందోళనకు గురైన ఆ బాలుడు ట్రాక్ పై పరుగులు తీసాడు.

అయితే అటుగా వెళుతున్న స్టేషన్ సిబ్బంది దీనిని గమనించి వెంటనే ఆ బాలుడిని ట్రాక్ పై నుంచి ప్లాట్ ఫామ్ మీదకు లాగేయడం తో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది.అదృష్టం కొద్దీ ఆ బాలుడు ట్రాక్ పై పడిపోయిన సమయంలో ట్రాక్ పై ఎలాంటి ట్రైన్స్ రాకపోవడం తో అతడు ఎలాంటి ప్రమాదం లేకుండా తప్పించుకోగలిగాడు.

ఈ తతంగం అంతా కూడా అక్కడి సీసీ టీవీ లో రికార్డ్ అవ్వడం తో ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube