శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన ఆ 9 ఏళ్ల చిన్నారి 'ప్లకార్డు' పై ఏం రాసిందో తెలుసా.?

సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పుతో శబరిమలలో మహిళల ప్రవేశంని నిరసిస్తూ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి… పోలీసులు భద్రతను మరింత పెంచారు.పోలీసులు ఎక్కడిక్కడ తనిఖీలు చేసి.

 9 Years Old Girl Holds Plug Card With Inspiring Message In Sabarimala-TeluguStop.com

మహిళలను వెనక్కు పంపిస్తున్నారు.మహిళలు ఆలయంలోకి ప్రవేశించకుండా భక్తులు ఆందోళనలు కొనసాగించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించడానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఇంకా వెల్లువెత్తుతున్నాయి.

అయ్యప్పమాల వేసుకొని తల మీద ఇరుముడి పెట్టుకున్న తొమ్మిదేళ్ల చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది.ప్రస్తుతం తనకు 50 ఏళ్లు పూర్తయిన తర్వాతే మళ్లీ శబరిమలను దర్శించుకుంటాను అని అర్థం వచ్చేలా రాసిన ప్లకార్డు పట్టుకుని ఆలయంలోకి ప్రవేశించింది.

శబరిమల ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న ఆచారాలను గౌరవించాలని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ పేర్కొన్నారు.శబరిమల ఆలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెబుతూనే.శబరిమల ఆలయం మతపరమైన విశ్వాసాలతో ముడిపడిందని, ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.మరోవైపు వయసుతో నిమిత్తం లేకుండా మహిళలంతా శబరిమల ఆలయంలోకి ప్రవేశించి అయప్ప స్వామిని దర్శించుకోవచ్చంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై.

ఆలయ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube