రాజమౌళి ఈగతోనే సినిమా ఎందుకు తీశారో తెలుసా..?

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగ సినిమా విడుదలై తొమ్మిది సంవత్సరాలైంది.విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీగా కలెక్షన్లను సాధించింది.

 9 Years For Rajamouli Technical Wonder Eega Movie, Eega Movie, Rajamouli, Rajamo-TeluguStop.com

కథ, కథనం అద్భుతంగా ఉంటే స్టార్ హీరోలు నటించకపోయినా సక్సెస్ సాధించవచ్చని రాజమౌళి ఈ సినిమాతో ప్రూవ్ చేశారు.బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసి ఈగ చేసిన విధ్వంసం అంతాఇంతా కాదు.

బలవంతుడైన విలన్ ను ఈగ ముప్పుతిప్పలు పెట్టే కథతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించాడు. మర్యాదరామన్న మూవీ తర్వాత ప్రభాస్ తో మూవీ తెరకెక్కించటానికి ఐదు నెలల సమయం ఉండటంతో ఈగ మూవీని జక్కన్న తెరకెక్కించాలని అనుకున్నారు.3 కోట్ల బడ్జెట్ తో సినిమా తీసి కొన్ని థియేటర్లలోనే సినిమాను రిలీజ్ చేయాలని రాజమౌళి భావించారు.ఈగ అనేది చిన్న పురుగు కావడంతో పాటు చేతితో సులువుగా విదిలించుకోగలుగుతాం.

Telugu Eega, Nani, Rajamouli, Rajamouli Eega, Samantha, Sudeep Kichcha, Technica

అలాంటి పురుగు మనిషిపై పగబడితే ఆసక్తికరంగా ఉంటుందని భావించి రాజమౌళి ఈగతో సినిమా తీయాలని అనుకున్నారు.అయితే తక్కువ బడ్జెట్ వల్ల సమస్యలు ఎదురు కాగా నిర్మాత సురేష్ బాబు భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించమని సూచించారు.అలా ఈగ మూవీ పట్టాలెక్కింది.ఈగ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని ఆ మూవీ అభిమానులు కోరుకుంటున్నారు.అయితే రాజమౌళి మాత్రం ఈగ సీక్వెల్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు.

Telugu Eega, Nani, Rajamouli, Rajamouli Eega, Samantha, Sudeep Kichcha, Technica

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఒక సందర్భంలో ఈగ మూవీకి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉందని అయితే ఆ ఆలోచన కార్యరూపం దాల్చటానికి సమయం పడుతుందని చెప్పినట్టు సమాచారం.రాజమౌళి భవిష్యత్తులో ఈగ మూవీకి సీక్వెల్ తీస్తారో లేదో చూడాల్సి ఉంది.ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ పనులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube