అదృష్టం ఆ అమ్మాయితోనే ఉంటుంది! అప్పుడు కారు.. ఇప్పుడు ఏకంగా ఏడు కోట్లు  

దుబాయ్ లో ఏడు కోట్ల లాటరీ కొట్టిన భారతీయ సంతతి బాలిక. .

9-year-old Indian Girl Wins $1 Million In Dubai-dubai,wins $1 Million

అమ్మాయి పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అనేది భారతీయులు చాలా మంది బలంగా విశ్వసించే మాట. ఇలాంటి మాటలు కొందరు అమ్మాయిల విషయంలో నిజం అవుతూ ఉంటాయి. కొన్ని కుటుంబాలలో అమ్మాయిలతో ఎ పని చేయించిన అది బంగారం అవుతుంది..

అదృష్టం ఆ అమ్మాయితోనే ఉంటుంది! అప్పుడు కారు.. ఇప్పుడు ఏకంగా ఏడు కోట్లు-9-year-old Indian Girl Wins Million Jackpot In Dubai

అదృష్టం కలిసి వస్తుంది. అలాగే భారతీయ సంతతికి చెందిన ఓ అమ్మాయి కూడా అదృష్టం వెంట తెచ్చుకుంది అని చెప్పాలి. మూడేళ్ల వయసులో ఓ లగ్జరీ కారు గెలుచుకున్న ఆ అమ్మాయి.

ఇప్పుడు 9 ఏళ్ల వయస్సు 7 కోట్లు లాటరీ గెలుచుకుంది.

తాజాగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులోని టెర్మినల్ 3లో కాన్‌ కోర్స్ బీ ఆవరణలో నిర్వహించిన డ్రా లో ఈ అమ్మాయి విజేత గా నిలిచింది. ఈ జాక్‌పాట్ కొట్టేసిన ఆ అమ్మాయి పేరు ఎలీజా. ఎలీజా తండ్రి ముంబైవాసి. 19 ఏళ్లుగా దుబాయ్‌ లో ఉంటున్నాడు. 15 ఏళ్లుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనేర్ ప్రమోషన్‌లో ఏళ్లుగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే ఇప్పుడు తన కూతురు పేరు మీద తీసిన లాటరీతో ఏడు కోట్లు ఫ్రైజ్ మనీ సొంతం చేసుకోవడంతో అతని ఆనందానికి అవధులు లేవు.