9 మంది నర్సులు , అందరూ ఒకేసారి గర్భవతులయ్యారు.... అసలు విషయం ఇదే..

ఒకేసారి ఇద్దరు నుండి నలుగురు ,ఐదుగురు పిల్లల్ని కన్నా తల్లుల గురించి విన్నాం , తక్కువ వ్యవధిలో ఎక్కువ మంది పిల్లల్ని కన్నా మహిళలను చూశాం , కాని అమెరికా లోని ఒక ఆసుపత్రి లో ఒక వింత చోటు చేసుకుంది.వాళ్లంతా స్నేహితులు పైగా ఒకే హాస్పిటల్ లో నర్సులుగా పనిచేస్తున్నారు.

 9 Nurses Are Pregnant At Same Hospital At The Same Time-TeluguStop.com

ఆ నర్సుల గురించి అమెరికా లోని మైన్ అనే నగరం లో ఎక్కువ చర్చ జరుగుతుంది.

అసలు విషయానికొస్తే అమెరికాలోని మైన్ అనే నగరం లో 9 మంది నర్సులుగా పనిచేస్తున్నారు.వారు ఆ ఆసుపత్రి లో మెటర్నిటీ విభాగం లో నర్సులుగా చేరిన కొద్దీ రోజులకే వారందరు మంచి స్నేహితులుగా అయ్యారు.ఆ ఆసుపత్రి కి వచ్చే ఎంతో మందికి వీరు ప్రసవం చేశారు.

వారందరికీ ప్రసవ సమయం లో దగ్గర ఉండి ఎన్నో సేవలందించారు.ఈ మెటర్నిటీ విభాగం లో పని చేస్తున్న తొమ్మిది మంది స్నేహితులు అయిన నర్సులందరు ఒకే సమయానికి గర్భం దాల్చారు.

వీరందరికి డెలివరీ టైం ఒకే రోజున వచ్చింది.ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ ఆసుపత్రి వైద్య బృందం వీరందరికి ఉచిత వైద్య సేవలు అందిస్తుంది.

వారందరు ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పటికి నర్సులుగా ఇంకా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఆ ఆసుపత్రి కి వచ్చి పోయే పేషెంట్ లు అందరూ వీరిని చూసి అవక్కవుతున్నారు.అయితే ఆ ఆసుపత్రి యాజమాన్యం ఆ నర్సులు వ‌రుస‌గా నిల‌బెట్టి ఫొటో తీసి వీళ్లంతా మా స్టాఫ్ నర్సులు , ఒకే విభాగంలో ప‌నిచేస్తారు.ఇప్పుడు వీళ్లంతా గ‌ర్భం దాల్చారు.

దాదాపు అంద‌రికీ ఒకేసారి డెలివ‌రీ కానుంది.అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్ కాస్తా ప్రస్తుతం వైర‌ల్ అవుతున్న‌ది.

అంద‌రూ ఒకే రంగులో ఉన్న డ్రెస్‌, హాస్పిట‌ల్ వాళ్లు ఇచ్చిన కార్డుతో ఫొటోల‌కు ఫోజులిచ్చారు.ఇక్క‌డ ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేంటంటే.ఈ తొమ్మిది మంది న‌ర్సులు ఒక‌రి టెస్టులు ఒక‌రు చేసుకున్నారు.

ఒక‌రి రిపోర్టులు మ‌రొక‌రు చెక్ చేసుకున్నారు.వీరందరికి ప్రసవం అయ్యేంత వరకు హాస్పిటల్ లో ఉన్న వైద్యులే బాధ్యత తీసుకుంటున్నారు అని చెప్తున్నారు.

ఈ నర్సులు గర్భిణిగా ఉన్నపటికీ ఎక్కువ సమయం ఆ హాస్పిటల్ కి వచ్చే ఇతర గర్భిణీలు సేవ చేస్తూ వారి వృత్తి పట్ల వారికున్న ప్రేమను చాటి చెప్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube