పూజా హెగ్డే గురించి చాలా మందికి తెలియని 9 ఆసక్తికరమైన విషయాలు ఇవే.!

పూజా హెగ్డే… దువ్వాడ జగన్నాధమ్ సినిమాలో తన అందచందాలకు కుర్రకారు దాసోహం అన్నారు.మొన్నటివరకు అవకాశాల కోసం వెతుకున్న పూజను ఆ ఒక్క సినిమాతో అవకాశాలే తన దగ్గరకు వచ్చేలా చేసుకుంది.

 9 Interesting Facts About Pooja Hegde-TeluguStop.com

అయినా సినిమా ప్రపంచం అంతా మాయ ఎవరెప్పుడు టాప్ పొజిషన్లో ఉంటారో తెలీదు.ఎవరెప్పుడు అవకాశాలు లేక కనుమరుగైపోతారో తెలీదు.త్వరలో ఆమె నటించిన అరవింద సమేత ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పుడు టాలివుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న పూజ హెగ్డే గురించిన ఆసక్తికరమైన విషయాలు.

1.ముంబైలో పుట్టిన పూజా తల్లిదండ్రులు మంజునాధ్, లతా హెగ్డే….పూజాకి వ్రిశబ్ అనే సోదరుడు కూడా ఉన్నాడు.

2.పూజా తల్లి స్వస్థలం కర్ణాటక.తల్లి మాతృ భాష తులు.ఆ భాషతో పాటు పూజాకి హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, కన్నడ వచ్చు.ఇప్పుడు తెలుగులో కూడా మాట్లాడగలుగుతుంది.అంటే మొత్తం ఆరు భాషల్లో పూజ మాట్లాడగలదు.

3.నెట్ వర్క్ మార్కెటింగ్ లో అమ్మకు సాయంగా ఉండేది.దీనికి కారణం పూజకు చిన్నప్పటి నుండి బిజినెస్ పట్ల ఉన్న ఆసక్తే… ఆ ఆసక్తితోనే ఎంకామ్ చేసింది.సినీ అవకాశాలు రాకుంటే వ్యాపార వేత్తగా మారిపోయేది.

4.2010 లో నిర్వహించిన అందాల పోటీలో పూజా మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకుంది…దాని వెనుక బోలెడు కృషే ఉంది.పూజ ఇంటర్ నుండే మోడలింగ్ చేసేది.

5.పూజా చేసిన అనేక వాణిజ్య ప్రకటనల్లో ఫెయిర్ అండ్ లవ్లీ, మాజా మంచి పేరు తెచ్చి పెట్టాయి.దీంతో సినీ ఛాన్స్ అందుకుంది.

6.ఈ ముంబై బ్యూటీకి కోలీవుడ్ నటిగా తొలి అవకాశం ఇచ్చింది.మూగమూడి సినిమాలో పూజా శక్తి రోల్ ని అద్భుతంగా పోషించి ఆకట్టుకుంది.సైమా అవార్డు ను కూడా అందుకుంది.ఒక లైలా కోసం,ముకుందా సినిమాలతో తెలుగులోనూ నటిగా పరిచయం అయింది.

7.కోలివుడ్,టాలివుడ్ లలో మూడు సినిమాలతర్వాత తన బాలీవుడ్ లోకి ప్రవేశించింది.అది కూడా హృతిక్ రోషన్ తో కలిసి నటించే అవకాశం పట్టేసింది.

8.పూజాకి ఆటలంటే ఇష్టం.టెన్నిస్ అంటే చాలా ఇష్టం.రోజర్ ఫెదరర్ కి వీరాభిమాని.

9.పూజా ఖాళీ దొరికితే పుస్తకం చేతిలోకి వచ్చేస్తుంది.నవలలని నమిలి మింగేస్తుంది.అంటే నవల చదవడంలోకి వెళితే అంత మరిచిపోతుంది.ఇక హ్యారీ పోటర్ సిరీస్ నవలల్ని ఎన్ని సార్లు చదివిందో ఆమెకే గుర్తులేదు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube