ఏపీలోని ఆ గ్రామంలో తొమ్మిది రోజుల సంక్రాంతి.. ఎందుకంటే..?  

సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీ లేదా 15వ తేదీన సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.అయితే ఏపీలోని విజయనగరం జిల్లాలోని ఒక గ్రామంలోని ప్రజలు మాత్రం తొమ్మిది రోజులు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.

TeluguStop.com - 9 Days Sankranti Festival In Itakarlapally Village

చాలా సంవత్సరాల నుంచి ఒక గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతోంది.ఇలా ఆ గ్రామ ప్రజలు తొమ్మిది రోజులు సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి ముఖ్యమైన కారణమే ఉంది.

విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి మండలంలోని ఇటకర్ల పల్లి గ్రామంలో సంవత్సరానికి తొమ్మిది రోజులు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.సాధారణంగా వచ్చే సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం నుంచే ఈ గ్రామంలో సంక్రాంతి పండుగ మొదలవుతుంది.

TeluguStop.com - ఏపీలోని ఆ గ్రామంలో తొమ్మిది రోజుల సంక్రాంతి.. ఎందుకంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

భోగి, కనుమ పండుగలను కూడా రెండుసార్లు ఈ గ్రామంలో జరుపుకుంటారు.ఇతర గ్రామాలకు భిన్నంగా తొమ్మిది రోజులు పండుగ జరుపుకోవడంతో ఈ గ్రామం వార్తల్లో నిలిచింది.

Telugu 9 Days Festival, Andhra Pradesh, Itakarlapally, Sankranti Festival, Vizianagaram-Latest News - Telugu

అయితే ఇటకర్ల పల్లి గ్రామంలో భోగి మంటలు మాత్రం వేయరు.పూర్వం భోగి మంటల్లో ఈ గ్రామంలో ఒక పిల్లి పడి మరణించింది.అప్పటినుంచి ఈ గ్రామ ప్రజలు భోగి మంటలకు దూరంగా ఉంటున్నారు.అయితే ఇలా జరుపుకోవడానికి ప్రత్యేక కారణం లేదని ఇది ఆనవాయితీగా కొనసాగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.భోగికి ముందు వచ్చే ఆది, సోమ, మంగళ వారాల్లో కెల్ల, కొంచాల, మీసాల కుటుంబాలకు చెందిన వారు సంక్రాంతి పండుగ జరుపుకుంటారు.

సాధారణ పండుగ రోజుల్లో గ్రామంలోని 70 కుటుంబాల ప్రజలు పండుగను జరుపుకుంటారు.

కమ్మరి కుటుంబీకులు మాత్రం 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి పండుగ చేసుకుంటారు.ఇలా ఇతర ప్రాంతాలకు భిన్నంగా పండుగను జరుపుకుంటూ ఈ గ్రామం వార్తల్లో నిలుస్తోంది.

గ్రామస్తులు పూర్వీకుల బాటలోనే నేటికీ సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉండటం గమనార్హం.

#Itakarlapally #9 Days Festival #Vizianagaram #Andhra Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు