ఈనెలలోనే మరో 9 రోజులపాటు బ్యాంకులు బంద్‌!

ఆగష్టు నెలలో బ్యాంకులు సెలవులు మరో తొమ్మిది రోజులపాటు బంద్‌ కానున్నాయి.దేశావ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు కృష్ణ జన్మాష్టమి, మొహర్రం రోజుల్లో అయితే, బ్యాంకులకు సెలవులు.

 Bank Holidays In August Month, August, Bank Holidays, Common Leaves, Bank Holida-TeluguStop.com

రాష్ట్రాలవారీగా బ్యాంకు సెలవులు కానీ, అన్ని బ్యాంకులకు బంద్‌ వర్తిస్తుంది.ఆ వివరాలు తెలుసుకుందాం.

ఈ 9 బ్యాంకు సెలవుల్లో ఆరు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ కాగా, పండగలకు ఆర్‌బీఐ బ్యాంకు జాబితాలో సెలవు దినంగా ప్రకటించారు.మిగతావి ఆది, శనివారాలు అవి కామన్‌ లీవ్స్‌.

ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకులు, కోఆపరేటీవ్, రీజనల్‌ బ్యాంక్స్‌ అన్ని మూసివేస్తారు.నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్, హాలిడే, రీయల్‌ టైం గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ హాలిడే, బ్యాంకుల ఖాతాలు మూసివేసే ప్రక్రియలో భాగంగా సెలవులు ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించుకునే పండగ సెలవులు అన్నీ బ్యాంకులకు వర్తించవు.సాధారణంగా బ్యాంకు సెలవులు ఈ ఏడాది ఇలా ఉన్నాయి.

రిపబ్లిక్‌ డే (జనవరి 26), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్‌ 2) క్రిస్టమస్‌ (డిసెంబర్‌ 25), దీపావళి, ఈద్, గురునానక్‌ జయంతి, గుడ్‌ ఫ్రైడే రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.

రెండు, నాలుగో శనివారాల్లో కూడా బ్యాంకులకు సెలవులు అని గుర్తుంచుకోవాలి.ఇక ఆదివారాలైతే తప్పనిసరి సెలవు దినంగా ఆర్‌బీఐ ప్రకటించింది.

2021 ఆగస్టు నెలలో ఆర్‌బీఐ జారీ చేసిన బ్యాంకుల సెలవులు ఇలా ఉన్నాయి.

ఆగస్టు 19– మొహర్రాం ( అగర్తాల, అహ్మదాబాద్, బేలపూర్, ముంబై, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్‌).
ఆగస్టు 21– తిరుఓనం (తిరువనంతపురం, కొచ్చి)
ఆగస్టు 22– ఆదివారం
ఆగస్టు 23– శ్రీ నారాయణ గురు జయంతి (తిరువతంతపురం, కొచ్చీ)
ఆగస్టు 28– నాలుగో శనివారం
ఆగస్టు 29– ఆదివారం
ఆగస్టు 30– జన్మాష్టమి (అహ్మదాబాద్, ఛంఢీగడ్, చెన్నై, డెహ్రాడూగ్, జైపూర్, కాన్పూర్, లక్నో, పాట్నా, రాయ్‌పూర్, షిల్లాంగ్, షిమ్లా, శ్రీనగర్, గ్యాంగ్‌టక్‌)
ఆగస్టు 31– శ్రీ కృష్ణ అష్టమి (హైదరాబాద్‌)

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube