ట్రంప్ కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన 8 ఏళ్ళ చిన్నారి...!!!  

8 Years Girl Climb The America-mexico Border Wall-america-mexico Border Wall,nri,ric Vebar,telugu Nri News Updates,రిక్ వెబర్

ఈ మధ్య కాలంలో ట్రంప్ కి షాకుల మీద షాకులు గట్టిగానే తగులుతున్నాయి.ఒకపక్క అధ్యక్ష ఎన్నికల్లో తనకి ప్రత్యర్ధిగా ఉన్న జో బిడెన్ పై చేసిన కుట్ర తాలూకు వ్యవహారం మొత్తం లీక్ అయ్యి పోయి అభిశంసనకి దగ్గరగా ఉన్న ట్రంప్ కి 8 ఏళ్ళ చిన్నారి రూపంలో మరో షాక్ తగిలింది.అమెరికాలో ప్రజలకి ఇచ్చిన వాగ్ధానం మేరకు అమెరికా సరిహద్దుల్లో వలసలని ఆపేందుకు గోడ కట్టేస్తాను, ఆ గోడని ఎక్కడానికి ఎవరూ సాహసం చేయలేరు అంటూ ప్రగల్భాలు పలికిన విషయం విధితమే.

8 Years Girl Climb The America-mexico Border Wall-america-mexico Border Wall,nri,ric Vebar,telugu Nri News Updates,రిక్ వెబర్-8 Years Girl Climb The America-Mexico Border Wall-America-mexico Wall Nri Ric Vebar Telugu Nri News Updates రిక్ వెబర్

కానీ ట్రంప్ వ్యాఖ్యలు కి చెక్ పెడుతూ 8 ఏళ్ళ చిన్నారి ట్రంప్ నిర్మిస్తున్న గోడని చెకచెకా ఎక్కేయడంతో పాటు ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇదేనా ట్రంప్ వలస వాసులు అక్రమంగా రాకుండా అడ్డుకునే గోడ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ట్రంప్ వ్యాఖ్యల్లో ఎంతటి సత్యం ఉందో తెలుసుకోవాలని భావించిన రిక్ వెబర్ అనే పర్వతారోహకుడు అచ్చం ట్రంప్ కడుతున్న గోదాలాంటి దాన్నే తన ఖాళీ స్థలంలో కొలతలతో సహా నిర్మించాడు.

8 Years Girl Climb The America-mexico Border Wall-america-mexico Border Wall,nri,ric Vebar,telugu Nri News Updates,రిక్ వెబర్-8 Years Girl Climb The America-Mexico Border Wall-America-mexico Wall Nri Ric Vebar Telugu Nri News Updates రిక్ వెబర్

 ఈ విషయం తెలుసుకున్న ఓ చిన్నారి ఆ గోడని నేను ఎక్కుతాను అంటూ వెబర్ వద్దకి వచ్చింది.అంతేకాదు ఆమె ఎటువంటి సాయం లేకుండా కేవలం చేతులు కాళ్ళతో మేనేజ్ చేసుకుంటూ చెకచెకా గోడని ఎక్కేసి అందరికి షాక్ ఇచ్చింది.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కొంతమంది ట్రంప్ పై వెటకారంగా కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఆ పిల్లలా అందరికి గోడని ఎక్కే శక్తి ఉండాలి కదా అంటూ ట్రంప్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు