అమెరికాలో మరో సారి పేలిన తూటా...8 మంది మృతి..!!!

అమెరికాలో మరో సారి తూటా పేలింది.గన్ కల్చర్ ను అమెరికాలో రూపు మాపాలని, అందుకు ప్రణాలికలు సిద్దం చేయాలని బిడెన్ పిలుపు ఇచ్చిన తరువాత ఏకంగా మూడు సార్లు అమెరికాలో కాల్పుల ఘటన జరగడం కొస మెరుపు.

 8members Shot Killed America-TeluguStop.com

ఇబ్బడి ముబ్బడిగా, చిన్నా పెద్దా తేడా లేకుండా అమెరికాలో తుపాకుల వాడకం ఎక్కువైపోతోంది.కొన్ని రోజుల క్రితం ఓ సూపర్ మార్కెట్ లో కాల్పుల ఘటన నమోదు కాగా, ఓ రెండేళ్ళ బాలుడు తన 8 నెలల తమ్ముడిపై గన్ ఫైర్ చేశాడు.

అలాగే స్కూల్ లో చదువుకునే పిల్లాడు ఏకంగా గన్ తో తన తోటి విద్యార్ధులపై గన్ తో దాడి చేశాడు.ఈ ఘటనలు మరువక ముందే మునుపెన్నడూ లేనివిధంగా గుర్తు తెలియని సాయుధులు తుపాకి గుళ్ళతో విరుచుకుపడ్డారు.

 8members Shot Killed America-అమెరికాలో మరో సారి పేలిన తూటా…8 మంది మృతి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

అమెరికాలోని ఇండియానాలో జరిగిన కాల్పుల ఘటన అమెరికా యావత్ ను షాక్ కు గురిచేసింది.

ఈ కాల్పుల ఘటనలో దాదాపు 8 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో అమెరికన్స్ గాయాల పాలయ్యారు.ఇండియానా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ గుర్తు తెలియని దుండగుడు ఇండియానా విమానాశ్రయం దగ్గరలో ఉన్న ఫెడెక్స్ అనే డెలివరీ కంపెనీ వద్దకు వచ్చాడని .వచ్చీ రాగానే విచక్షణా రహితంగా కాల్పులు మొదలు పెట్టడంతో అక్కడ పనిచేస్తున్న వారికి ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపులే ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు.సదరు కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి కాల్పులు జరిపిన దుండగుడుని తాను చూశానని తెలిపాడు.

అత్యంత ఆధునికమైన గన్ తో అతడు నా తోటి సిబ్బందిపై దాడి చేశాడని సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపాడని, పోలీసులు వచ్చేలోగానే అతడు తనను తాను కాల్చుకుని చనిపోయాడని తెలిపాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

కాగా అమెరికాలో పతీ ఏటా సుమారు 40 వేల మంది కాల్పుల ఘటనల కారణంగా మృతి చెందుతున్నారని ఏటా ఈ సంఖ్య పెరగుతోందని అందుకు కారణం అమెరికాలో గన్ కల్చర్ కు అనుమతులు ఉండటమేనని స్వచ్చంద సంస్థల ప్రతినిధులు వాపోతున్నారు.

#Gun Culture #America #8 Members Died #FedEx #8People

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు