వామ్మో... ఇళ్ల మధ్యలో ప్రత్యక్షమైన 8 అడుగుల మొసలి... చివరకు ఏమైందంటే...?

దేశంలో లాక్ డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో వన్యప్రాణాలు అడవి నుంచి జనసంద్రంలోకి వచ్చి బహిరంగంగా తిరుగుతున్నాయి.పులులు, చిరుతలు, బ్లాక్ పాంథర్లు, ఎలుగు బంట్లు ఇలా అనే జంతులు మనుషుల మధ్యలోకి వచ్చాయి.

 An 8-feet-long Crocodile Rescued From Manjalpur Area In Vadodara, Wildlife Depar-TeluguStop.com

ప్రజలు వీటిని చూసి భయాందోళనకు గురవ్వడం.అటవీశాఖ అధికారులు వాటిని బంధించి అడవుల్లోకి వదిలేయడం సర్వసాధారణం అయింది.

అయితే గుజరాత్ లో 8 అడుగుల పొడవు కలిగిన ఓ మొసలిని చూసి స్థానికులు భయాందోళనకు గురిచేసింది.గుజరాత్ లోని వడోదర జిల్లాలోని మంజల్ పూర్ ప్రాంతంలో మొసలి ప్రవేశించింది.

ఈ గ్రామానికి సమీపంలో నది ఉంది.వర్షాకాలం కావడంతో వరద ఉధృతి పెరగటం వల్ల మొసళ్లు వస్తుంటాయి.

అలానే ఎనిమిది అడుగుల పొడుగైన మొసలి ఇళ్ల మధ్యలోకి రావడంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సంప్రదించారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని మొసలిని అతి కష్టం మీద పట్టుకుని బంధించారు.అటవీశాఖ అధికారి మాట్లాడుతూ.‘‘ వర్షాకాలంలో మొసళ్లు నదుల నుంచి బయటకు వస్తుంటాయి.వరద ఎక్కువగా ఉండటం వల్ల చాలా వరకు మొసళ్లు కనిపించవు.

నీటి ప్రవాహం తగ్గినప్పుడు మాత్రమే ఈ వన్యప్రాణులను గుర్తించగలం.’’ అని అటవీ శాఖ అధికారి పేర్కొన్నాడు.

మొసలిని బంధించి వైద్య పరీక్షల కోసం పంపించామన్నారు.రిపోర్టులు రాగానే మొసలి పరిస్థితిని చూసి నదిలో వదిలేస్తామని అధికారులు తెలిపారు.

కాగా, గత నెల 16వ తేదీన రాజ్ మహల్ రోడ్డు దగ్గరున్న నివాస ప్రాంతంల్లోకి కూడా 5 అడుగుల మొసలిని స్థానికులు గుర్తించారు.గుజరాత్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఎనిమల్స్ (జీఎస్ పీసీఏ) సంస్థ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఆ మొసలిని బంధించి అడవిలో వదిలేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube