పిల్ల కావాలి అంటూ 84 ఏళ్ల వృద్ధుడి ప్రకటన

84 ఏళ్ల వయసు అంటే ఎవరైనా కూడా ఏదో కృష్ణ రామ అనుకుంటూ కూర్చుంటారు.కానీ 84 ఏళ్ల ఒక వృద్ధుడు మాత్రం ఈ వయసులో తనకు పిల్ల కావలి అంటూ కోరాడు.

 84years Old Man Funny Matrimonial Add-TeluguStop.com

అయితే ఈ తతంగం అంతా కూడా ఆయన స్వయంగా ప్రకటన ఇచ్చి మరి ఒక పిల్ల కోసం వెతుకుతున్నారు.వయసు మాత్రం 84 ఏళ్లు.

మీరేం కంగారు పడాల్సిన పనిలేదు.తన కళ్లు, పళ్లు, మోకాళ్లు, చెవులు బాగానే పనిచేస్తున్నాయని క్లారిటీ ఇచ్చాడు.అంతేకాకుండా తనకు రూ.3 కోట్లు విలువ చేసే ఒక ఇల్లు ఉందని, బ్యాంకులో రూ.5 లక్షలు ఎఫ్‌డీ ఉందని కూడా ఆ ప్రకటన లో తెలిపాడు.మరో విషయం ఏంటంటే స్మోకింగ్, డ్రింకింగ్ హాబిట్స్ కూడా లేవని,తాను పూర్తి గా శాఖాహారి ని అని చెప్పాడు.

పాపం ఆ వయసులో ఆయన ఒంటిరితనంతో బాధపడుతున్నారో.లేక కొడుకులు, కూతుర్లు పట్టించుకోక కోపంతో ప్రకటన ఇచ్చాడో తెలియదు కానీ ఈ న్యూస్ పేపర్ కటింగ్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పిల్ల కావాలి అంటూ 84 ఏళ్ల వృద్ధ�

దీనితో నెటిజన్లు అందరూ కూడా ఈ వయసులో ఆయన డేర్ ను మొచ్చుకుంటుండగా,మరి కొందరు అయితే నాటి గ్రాండ్ పా అంటూ సెటైర్లు వేస్తున్నారు.ఏది ఏమైనా ఆయనకు మాత్రం ఒక పిల్ల కావాలి అని, పెళ్లి చేసుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube