కరోనా పుణ్యమా అని 47వ సారి 10వ తరగతి పాసైన తాత...

ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ  రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇటీవలే ప్రభుత్వ విద్యాధికారులు అధికారికంగా ప్రకటన చేశారు.దీంతో తాజాగా సోషల్ మీడియా మాధ్యమాలలో హైదరాబాద్ నగరానికి చెందినటువంటి 82 సంవత్సరాలు కలిగిన ఓ వృద్ధుడు 46 సార్లు పదోతరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యాడని, కానీ ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేయడంతో పాస్ అయ్యాడని పలు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

 10th Class Examination, 82 Years Old Men,  47th Time, Rajasthan,-TeluguStop.com

అయితే ఈ విషయం పై కొంత మంది నెటిజన్లు స్పందిస్తూ 82 సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధుడు పదో తరగతి పరీక్షలను 47 సార్లు రాసి ఫెయిల్ అయిన మాట వాస్తవమేనని కానీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన శివ చరణ్ యాదవ్ అని అంటున్నారు.అలాగే శివ చరణ్ యాదవ్ చివరిగా 2016వ సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యాడని అంటున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.మరోవైపు రాష్ట్రంలోని పలువురు ప్రజా సంఘ నాయకులు కూడా ఈ విషయాన్ని తప్పుపడుతున్నారు.

అంతేకాక విద్యార్థి దశలో పదో తరగతి పరీక్షలు ఎంతో కీలకమైనదని కాబట్టి కొంచెం ఆలస్యమైనా సరే పదో తరగతి పరీక్షలు కచ్చితంగా నిర్వహించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube