వణుకుతున్న ఏపీ,24 గంటల్లో ఏకంగా 82 కరోనా మరణాలు!

కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్ ను వణికించేస్తుంది.కేవలం 24 గంటల వ్యవధిలోనే 82 కరోనా మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

 Registered Record Level Covid Cases In Ap State, Covid Cases, Ap State, Coronav-TeluguStop.com

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం 24 గంటల వ్యవధిలో 9 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా,82 కరోనా మరణాలు సంభవించినట్లు తెలిపింది.దీనితో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 64 వేల పై చిలుకుకుచేరగా, మరణాల సంఖ్య 2,378 గా ఉన్నట్లు తెలుస్తుంది.

గడచినా 24 గంటల్లో 55 వేలమందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా 9 వేలమందికి పైగా కరోనా పాజిటివ్ అని తేలింది.

ఏపీ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసులు మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా మహారాష్ట్ర ,తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

కర్ణాటక లో కూడా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు తాజాగా నమోదు అయినట్లు సమాచారం.ఏపీ లో కూడా ఒక్క రోజు లోనే 82 మరణాలు చోటుచేసుకోవడం జనాల్లో ఆందోళన కలిగిస్తుంది.

కేసుల సంఖ్య కూడా 2 లక్షలకు పైగా నమోదు అవ్వడం మరింత ఆందోళన కలిగించే అంశం.

తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో గుంటూరు జిల్లా లో అత్యధికంగా నమోదు కాగా, ఆతరువాత స్థానాల్లో చిత్తూరు,విశాఖపట్నం,అనంతపురం,పశ్చిమ గోదావరి, కర్నూల్, కడప,నెల్లూరు,ప్రకాశం,విజయ నగరం,శ్రీకాకుళం జిల్లాల్లో నమోదు అయినట్లు తెలుస్తుంది.

దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం కేవలం 24 గంటల వ్యవధిలో 67 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవ్వడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube