80 వేల మంది ఉద్యోగాలు ఉడనున్నాయి

ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లో 4జీ టైం నడుస్తోంది.మరి కొన్నాళ్లలో 5జీ కూడా రంగంలోకి రాబోతుంది.

 80thousand Employesjobs Aregone In Bsnl Mobile-TeluguStop.com

ఇలాంటి సమయంలో కార్పోరేట్‌ సంస్థలకు పోటీగా నిలవడంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ పూర్తిగా విఫలం అయ్యింది.మొబైల్‌ రంగం ఆరంభంలో ఉన్న సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశంలోనే అతి పెద్ద కమ్యూనికేషన్‌ వ్యవస్థ.

కొన్ని లక్షల ల్యాండ్‌ లైన్‌ కలెక్షన్స్‌ను ఇవ్వడం ద్వారా భారీ లాభాలను దక్కించుకుంది.ఆ తర్వాత మొబైల్‌ సర్వీస్‌లను ప్రారంభించిన తర్వాత కూడా కొంత కాలం వరకు బీఎస్‌ఎన్‌ బాగానే పని చేసింది.

గ్రామాల్లో కూడా తమ సిగ్నల్‌ ఉండటం వల్ల భారీగానే కస్టమర్లను ఏర్పర్చుకోవడం జరిగింది.కాని కాల క్రమేనా ఎయిర్‌టెల్‌, ఐడియా, వోడాఫోన్‌లు రావడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ పరిస్థితి దారుణంగా పడిపోయింది.

 

ల్యాండ్‌ లైన్‌ కలెక్షన్స్‌ 90 శాతం తగ్గడంతో పాటు, మొబైల్‌ వినియోగదారులకు ఆకర్షనీయమైన పథకాలను పెట్టడంలో విఫలం అయ్యింది.ఒకవైపు కార్పోరేట్‌ సంస్థలు అయిన ఎయిర్‌టెల్‌ మరియు ఐడియాలు రికార్డు స్థాయిలో వినియోగదారులను పెంచుకుంటూ పోతే బిఎస్‌ఎన్‌ మాత్రం తగ్గించుకుంటూ వచ్చింది.

ఇక అదే సమయంలో జియో రావడంతో పరిస్థితి పూర్తిగా మారింది.ఐడియా, ఎయిర్‌టెల్‌ లకే దిక్కులేకుండా పోయింది.

ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ పరిస్థితి మాటల్లో చెప్పలేం.ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించడం తప్ప మరేం చేయలేమని కేంద్రం నిర్ణయానికి వచ్చింది.

అందుకే ఏకంగా 80 వేల మంది బీఎస్‌ఎన్‌ ఉద్యోగస్తులను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.వారికి ఆకర్షనీయమైన వేరే ఆఫర్‌లను అందిస్తూ బీఎస్‌ఎన్‌ఎల్‌ నుండి తప్పిస్తున్నారు.80 వేల మందిని తొలగించిన తర్వాత ఆర్ధిక వనరులు చేకూరి మళ్లీ బీఎస్‌ఎన్‌ఎల్‌ను అభివృద్ది పథంలో పెడతామంటూ యాజమాన్యం అంటున్నారు.అది సాధ్యం కాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా మారక పోతే వెనకబడి పోతాం అనేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube