పెద్దమ్మ పెద్ద మనసు.. రూపాయికే ఇడ్లీ, దోశ!

ఆకలితో ఉన్న మనిషికి ఆకలి తీర్చాలంటే మేడలు, కార్లు ఉండవలసిన అవసరం లేదు.మంచి మనసుంటే చాలు అని నిరూపించింది.

 Tamilnadu Old Woman Selling Idly, Dosa For One Rupee, Idly, 80year Old Woman, Ta-TeluguStop.com

తమిళనాడుకు చెందిన ఓ బామ్మ.కేవలం రూపాయికే ఇడ్లీ, దోసే విక్రయిస్తూ పేదల పాలిట అన్నపూర్ణాదేవిగా అవతరించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.తమిళనాడులోని తిరువరూర్ నారమంగళం గ్రామానికి చెందిన 80 ఏళ్ల కమల గత 50 సంవత్సరాలుగా హోటలే జీవనాధారం.హోటల్ అంటే నగరాలలో ఉన్నట్టు ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేవు.ఆమె హోటల్ కేవలం తాటాకు గుడిసె.

అక్కడున్న పెద్ద పెద్ద బండారాళ్లే టేబుల్.అక్కడ దొరికే పచ్చని పెద్ద ఆకులే విస్తర్లు.

ఇది కమల పట్టి హోటల్.

కమల పట్టికి ఇద్దరు కొడుకులు.

వారి పెళ్లిళ్లు చేసుకొని వేరుగా ఉండడంతో ఈమె ఒంటరిగా మిగిలిపోయింది.తాను ఎవరి మీదా ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో తన కష్టార్జితంగా ఈ హోటల్ నడుపుతుంది కమలమ్మ.

ప్రతిరోజు వ్యవసాయ పనుల కోసం వెళ్లేవారు ఇక్కడ ఇడ్లీ, దోసెల కోసం బారులు తీరి ఉంటారు.పది రూపాయలు ఇచ్చి పది దోసెలు లేదా 10 ఇడ్లీలు తిని సంతృప్తిగా వెళ్లేవారు.

వారు ఇచ్చే డబ్బులు కాకుండా, వారి ఆకలిని తీర్చినందుకు తనకు తృప్తిగా ఉందని చెబుతుంది కమలమ్మ.

అయితే కరోనా కాలంలో పెరిగిన ధరలను ఏమాత్రం లెక్కచేయకుండా, ఇప్పటికీ రూపాయికే ఇడ్లీ, దోసెలను విక్రయిస్తోంది కమలమ్మ.

అతి తక్కువ ధరకే పేదల ఆకలి తీరుస్తూ ఉండడంతో గ్రామస్తులందరూ కమలమ్మ కు సలాం చెబుతున్నారు.గత 50 సంవత్సరాలుగా ఈ బామ్మ ఇక్కడే ఇడ్లీ దోసె రూపాయికి అమ్ముతోంది.

నాలాంటి పేదవారు కేవలం 10 రూపాయలకే ఆకలి తీర్చుకోవచ్చు.అదే బయట అయితే ఒక్క దోసెకు 35 నుంచి 40 వరకు చెల్లిస్తాను.

కానీ ఇక్కడ అలా కాదు అని ఒక గ్రామస్తుడు చెప్తున్నాడు.మా అమ్మ 50 పైసలకే ఇడ్లీ దోశ అమ్మి మమ్మల్ని పోషించింది.

ఆమె మరణించాక ఈ వ్యాపారం నేను చేపట్టాను.అప్పటి నుంచి కేవలం రూపాయికే ఇడ్లీ, దోసే అమ్ముతున్నాను అని కమలమ్మ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube