ప్రభాస్ కోసం హైదరాబాద్ లోనే రోమ్ సిటీ కట్టేస్తున్నారు  

ప్రభాస్ సినిమా కోసం 80 కోట్లతో రోమ్ సిటీ సెట్ వేస్తున్న దర్శకుడు. .

80 Crores Rome Set For Prabhas Next Movie-bollywood,pooja Hegde,prabhas Next Movie,rome Set,tollywood

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్ పై జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే పీరియాడికల్ లవ్ స్టొరీ తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఓ వైపు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సాహో సినిమా మెజారిటీ షూటింగ్ ఫినిష్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్ కోసం తన లుక్ మార్చుకునే పనిలో పడ్డాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాష్ వింటేజ్ కార్ల వ్యాపారిగా కనిపిస్తాడని, అప్పటి రోమ్ సిటీలో ధనిక ప్రజలు ఎలా ఉండేవారో అలాంటి ఆహార్యంలో కనిపిస్తాడని తెలుస్తుంది..

ప్రభాస్ కోసం హైదరాబాద్ లోనే రోమ్ సిటీ కట్టేస్తున్నారు -80 Crores Rome Set For Prabhas Next Movie

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కనిపించే రోమ్ సిటీని సుమారు 80 కోట్ల రూపాయిలతో అన్నపూర్ణ స్టూడియోలోనే నిర్మిస్తున్నారని తెలుస్తుంది. కళా దర్శకుడు రవీందర్ రోమ్ సిటీ సెట్ ని డిజైన్ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. ఇక ఈ సెట్ నిర్మాణం పూర్తి కాగానే మెజారిటీ షూటింగ్ అందులో పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డేతో ప్రభాస్ రొమాన్స్ అందరికి ఆకట్టుకుంటుంది అని, వింటేజ్ ఫారిన్ లవ్ స్టొరీ చూసిన ఫీలింగ్ కలుగుతుందని చెప్పుకుంటున్నారు.