దాచుకున్న డబ్బుని టీవీలో చూసి కేరళ బాధితులకు డొనేట్ చేసింది..! ప్రతిఫలంగా బంపర్ ఆఫర్.!

కేర‌ళ‌లో ప్ర‌కృతి విప‌త్తు, వ‌ర‌ద‌ల స‌మ‌యంలో జాతీయ స్థాయిలో ప్ర‌జ‌లు కుల మత బేధాలు లేకుండా స్పందిస్తున్నారు.త‌మ స్థాయికి త‌గ్గ‌ట్టు విరాళాలు ఇస్తున్నారు.

 8 Year Old Tamil Girl Donates Piggy Bank Savings To Kerala Relief Fund-TeluguStop.com

కొంద‌రు ఐదు రూపాయ‌లు ఇస్తున్నారు కొందరు ల‌క్ష రూపాయ‌లు .హీరోలు, సామాన్యులు, మంత్రులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఉద్యోగం లేని వాళ్లు.ఇలా ఎవ‌రికి తోచిన విధంగా వారు స‌హాయం చేస్తున్నారు.

ఈ క్రమంలో నేను సైతం అంటూ ఓ చిన్నారి ఆకర్షణీయంగా నిలిచింది.

తనవంతు సాయంచేసి మానవత్వాన్ని చాటుకోవడంతో పాటు తన కలను సాకారం చేసుకుంది.నాలుగేళ్లపాటు దాచుకున్న సుమారు 9వేల రూపాయలను డొనేట్‌ చేసింది.వివరాలలోకి వెళ్తే.

తమిళనాడు, విలుపురం జిల్లాకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి అనుప్రియ మూడవ తరగతి చదువుతోంది.

వరద బాధితులు, ముఖ్యంగా పిల్లలు పడుతున్న అవస్థల్ని టీవీలో చూసి చలించిపోయింది.ఏకంగా ఐదు పిగ్గీ బ్యాంకుల్లో దాచుకున్న 8,240 రూపాయలను కేరళ వరద బాధితులకు విరాళంగా ప్రకటించింది.

ఈ మొత్తం నాణేలను సోమవారం స్థానిక బ్యాంకులో డిపాజిట్ చేసింది.

ఎల్‌కేజీలో ఉన్నప్పటినుంచీ సైకిల్‌ కొనుక్కోవాలనే కోరికతో రోజుకు కనీసం రెండు రూపాయల చొప్పున పిగ్గీ బ్యాంకులో దాచుకుంటున్నా.కానీ టీవీలో కేరళ ప్రజలు, చిన్నపిల్లలు పడుతున్న ఇబ్బందులు చూసాకా బాధ అనిపించింది.అందుకే నేను సేవ్‌ చేసుకున్న డబ్బులు వారికివ్వాలని నిర్ణయించుకున్నానని అనుప్రియ చెప్పింది.

ఎవరికైనా మంచి చేస్తే అదిఎప్పటికైనా నీకు మంచి చేస్తుందన్న పెద్దలమాట అనుప్రియ విషయంలో నిజమైంది.తన ఔదార్యంతో దేశీయ సైకిళ్ల కంపెనీ బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది.

ఏ ఉద్దేశంతో అయితే పిగ్గీ బ్యాంకులో డబ్బు దాచుకుందో ఆ కోరికను నెరవేర్చాలని నిర్ణయించింది హీరో సైకిల్ సంస్థ.చిన్నారికి కొత్త సైకిల్‌ను కానుకగా ఇస్తామని ప్రకటించింది.

అంతేకాదు సంవత్సరానికి ఒక కొత్త బైక్‌ను గిఫ్ట్‌గా అందిస్తామంటూ హీరో మోటార్స్‌ గ్రూప్‌ చైర్మన్‌, ఎండీ పంకజ్ ఎం ముంజాల్ ట్వీట్‌ చేశారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube