టాటూలు వేసే వ్య‌క్తికి ఇప్ప‌టి దాకా 8 పెండ్లిలు.. అంతా ఒకే ఇంట్లో

పెండ్లి చేసుకుని ఒక్క భార్య‌తో వేగ‌డం అంటేనే చాలామంది పెద్ద ప‌ని అన్న‌ట్టు చెబుతుంటారు.ఇక రెండో పెండ్లి అంటేనే పారిపోతారు.

 8 Weddings So Far For The Person Getting The Tattoo Everything Is Still In The House, 8 Weddings, Viral News , Thailand, Marrege, Tattoo, Latest Viral-TeluguStop.com

ఎందుకంటే ఒక్క‌రిని భ‌రించ‌డ‌మే పెద్ద స‌మ‌స్య అంటే.ఇక ఇద్ద‌రినా అన్న‌ట్టు వాపోతుంటారు.

ఎందుకంటే పెండ్లి చేసుకుంటే జీవితం పూర్తిగా మారిపోతుంది.అప్ప‌టి వ‌ర‌కు ఉన్నట్టు ఉండాలంటే చాలా క‌ష్టం.

 8 Weddings So Far For The Person Getting The Tattoo Everything Is Still In The House, 8 Weddings, Viral News , Thailand, Marrege, Tattoo, Latest Viral-టాటూలు వేసే వ్య‌క్తికి ఇప్ప‌టి దాకా 8 పెండ్లిలు.. అంతా ఒకే ఇంట్లో-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాధ్య‌త‌లు పెరిగిపోతుంటాయి.అయితే ఇలా ఒక్క పెండ్లికే విసుగొచ్చే వారికి ఇప్పుడు మేము చెప్ప‌బోయే వ్య‌క్తి గురించి వింటే మాత్రం ఆశ్చ‌ర్య‌పోతారు.

అత‌ను ఏకంగా ఎనిమిది పెండ్లిలు చేసుకున్నాడు.

పైగా వారంద‌రినీ ఒకే ఇంట్లో పెట్టుకుని నివ‌సిస్తున్నాడు.

ఇద్ద‌రు భార్య‌లు ఉంటేనే రోజూ ర‌చ్చ ర‌చ్చ అవుతుంది.అలాంటిది ఎనిమిది మందిని ఒకే చోట పెట్టినా కూడా ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా ఉండ‌టం ఇక్క‌డ విచిత్రం.

థాయ్‌లాండ్ కు చెందిన ఒంగ డామ్ వృత్తి రీత్యా టాటూలు వేసుకునే వ్య‌క్తి.అయితే అత‌నికి ఓ అమ్మాయితో ప‌రిచ‌యం అయి ఆమెను పెండ్లి చేసుకున్నాడు.

ఇక రెండో భార్య‌ను మార్కెట్లో చూసి పెండ్లి చేసుకున్నాడు.అలాగే మూడో భార్య‌ను ఆసుపత్రిలో చూసి ఇష్ట‌ప‌డి ఒప్పించి పెండ్లి చేసుకున్నాడు.

ఇక నాలుగో భార్యను ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తేఐదో వైఫ్ ను ఫేస్‌బుక్‌లో చూశాడంట‌.వారంద‌రితో ప‌రిచ‌యాలు పెంచుకుని చివ‌ర‌కు పెండ్లి చేసుకున్నాడు.ఇక ఆరో భార్యను, ఏడో భార్య‌ను, ఎనిమిదో భార్య‌ను ఇలా ఏదో ఒక చోట చూసి ప‌రిచ‌యం పెంచుకుని వివాహం చేసుకుంటున్నాడు.పైగా వారంద‌రికీ నిజం చెప్పే పెండ్లి చేసుకుంటున్నాడు.

అత‌నికి భార్య‌లు ఉన్నార‌ని తెలిసినా కూడా అమ్మాయిలు అత‌న్ని పెండ్లి చేసుకుంటున్నారుఇక కొత్త పెండ్లిల‌కు భార్య‌లు కూడా అడ్డు చెప్ప‌ట్లేదు.మ‌రి అత‌ని పెండ్లిలు ఇక్క‌డితో ఆగుతాయో ముందుకు వెళ్తాయో తెలియ‌దు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube