అమ్మాయిల గురించి అబ్బాయిలు ఎప్పటికీ అర్థం చేసుకోలేని 8 విషయాలు

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటూ ఎందరో సినీమహాకవులు చెప్పారు.నిజంగానే ఆడవారి మాటలు, చేష్టలు మగవారికి అర్థం కావు.

 8 Things Men Can Never Understand About Women-TeluguStop.com

ఆడవారికి ఎలా అర్థం చేసుకోవాలి అంటూ వంద పుస్తకాలు వచ్చినా, అందులో వంద చిట్కాలు ఉన్నా, ఆడవారిని పూర్తిగా అర్థం చేసుకోవడం మగజన్మకు సాధ్యపడే విషయం కాదు.అందులోనూ ఈ 8 విషయాలు అయితే ఎప్పటికీ అర్థం కావు.

* షాపింగ్ గంటలకొద్దీ ఎందుకు చేస్తరో అర్థం కాదు.అమ్మాయి ఒక్క చీర కొనేలోపు అబ్బాయి ఈజీగా మూడు నాలుగు జతల బట్టలు కొనేస్తాడు.

* ప్రపోజ్ చేసిన అబ్బాయిలను రిజెక్ట్ చేయాలనుకుంటే “అన్నయ్య”ని ఎందుకు అంటారో అర్థం కాదు.అప్పటికప్పుడు సడెన్ గా అన్నయ్య అనే ఫిలింగ్ నిజంగానే వస్తుందా?

* చాలా తక్కువ లవ్ స్టోరీలే పెళ్లిపీటల వరకు వెళతాయి.అసలు మధ్యలో వదిలేసి అబ్బాయిలనే ఏరికోరి మరి ప్రేమిస్తారు అమ్మాయిలు.నిజంగా ప్రేమించేవాడిని మాత్రం కుక్కలా ట్రీట్ చేస్తారు.ఇలా ఎందుకో అర్థం కాదు.

* ఏ జోక్ కి నవ్వుతారో, ఏ జోక్ కి కోపగించుకుంటారో అర్థం కాదు.

* లవ్ ఫెయిల్ అయితే వెంటనే ఎలా తేరుకుంటారో అర్థం కాదు.ప్రపంచంలో రోజుకి కనీసం వందల్లో కొత్త దేవదాసులు పుట్టుకొస్తారు.ఆ ఒక్క అమ్మాయినే తలుచుకుంటూ ఏళ్ళు గడుపుతారు.కొందరు పెళ్ళి కూడా చేసుకోరు.

ఇలా ఏ అమ్మాయి విషయంలో అయినా జరిగిందా?

* మొదటిసారి ఎప్పుడు కలిసారు? మొదటి ముద్దు ఏరోజు పెట్టుకున్నారు.ఇవన్ని అబ్బాయిలకి గుర్తుండవు.

కాని అమ్మాయిలకి గుర్తు ఉంటుంది.ఇదేలా సాధ్యమో అర్థం కాదు.

* అబ్బాయిలకి కోపమొచ్చి నాలుగు మాటలంటే అది పురుషహంకారం.అదే అమ్మాయి అంటే అది బాధ్యత.

ఈ లాజిక్ అర్థం కాదు.

* “నువ్వంటే నాకు ఇష్టమే .కాని ఫ్రెండ్ గా మాత్రమే” ఈ జవాబులు ఈ జన్మకి అర్థం కావు.

* “నన్ను బాగా చూసుకునేవాడు కావాలి” అని అంటారు.

కాని బాగా చూసుకునేవారిని చులకనగా చూస్తూ, భవిష్యత్తులో బాగా చూసుకునేవాడు వస్తాడు అనే అలోచనతో ఉంటారు.ఆ నమ్మకం ఏంటో అర్థం కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube