ఒకే రోజు 8 సినిమాలు.. జనవరి 29న సినీ జాతర!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరించినప్పుడు ఎటు చూసినా లాక్ డౌన్ ప్రకటించారు.ఇటు సినిమా హాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, ఎటు చూసినా లాక్ డౌన్ కారణంగా మూసేశారు.

 Tollywood 8 Movies Releasing On January 29, Tollywood, 8 Telugu Films, January 2-TeluguStop.com

లాక్ డౌన్ సమయంలో సినిమా థియేటర్లు క్లోజ్ చేశారు.దీనితో ఇటు సినీ ఇండస్ట్రీ వారికి, ఇది సథియేటర్ సిబ్బందికి చాలా నష్టం వాటిల్లింది.

కరోనా తర్వాత ఎప్పుడెప్పుడా అని సినిమాల కోసం ఎదురు చూసారు.

లాక్ డౌన్ సడలింపు తర్వాత సినిమా హాల్ తెరిచారు.

ప్రస్తుతం థియేటర్లో కొన్ని సినిమాలు ఆడుతున్నాయి.థియేటర్స్ ఓపెన్ కావడంతో సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి.

ఇప్పుడు సినిమా థియేటర్లు పూర్తిగా ఓపెన్ చేశారు.సినిమా థియేటర్స్ ఓపెన్ కావడమే తరువాయి ఎన్నేళ్ళ నుంచో వేచిచూస్తున్న సినిమాలనే ఒకేసారి వచ్చేస్తున్నాయి.

ఒకటి కాదు రెండు కాదు ఎన్ని సినిమాలు అని అడిగితే చెప్పడం కూడా కష్టమే.ఎందుకంటే అన్ని సినిమాలు వస్తున్నాయి మరి.

Telugu Telugu, Amma Deevena, Evarucheppina, Jai Sena, January, Kalaaposhakulu, R

ఇక విషయంలోకి వెళితే ఈ నెల 29 న ఏకంగా 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.అన్ని థియేటర్స్ లోనూ వస్తుండటం విశేషం.అందులో ప్రదీప్ నటించిన సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కూడా విడుదలవుతోంది.ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈ సినిమాపై కూడా అంచనాలు చాలా ఉన్నాయి.పునర్జన్మల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాతో హీరోగా నిలబడాలని ప్రయత్నిస్తున్నాడు ప్రదీప్.దాదాపు4.9 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ చిత్రం.

ఈ సినిమా ఒక్కటే కాదు ఈ సినిమా తో పాటు ఏడు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.సీనియర్ హీరోయిన్ ఆమని నటించిన అమ్మ దీవెన,సీనియర్ నటి అన్నపూర్ణమ్మ టైటిల్ రోల్ పోషించిన అన్నపూర్ణమ్మ గారి మనవడు,శ్రీకాంత్,సునీల్ కీలక పాత్రలు పోషించిన జై సేన,నూతన నటీనటులు నటించిన మిస్టర్ అండ్ మిస్, రొటీన్ కు కొంచెం భిన్నంగా కొత్త కథతో తెరకెక్కిన ఎవరు చెప్పినా నమ్మరు, రొమాంటిక్ ఎంటర్టైనర్, కళాపోషకులు సినిమాలు కూడా ఈ జనవరి 29న విడుదల అవుతున్నాయి.

మరోవైపు జనవరి 30వ తేదీన హాలీవుడ్ డబ్బింగ్ సినిమా అమెరికన్ కమాండోస్ కూడా విడుదల కానుంది.ఇన్ని సినిమాలు ఒకే రోజు విడుదల అవుతున్నాయి అంటే నేను కూడా పండగ చేసుకుంటున్నాను.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube