ఏమి బతుకు…ఏమి బతుకు” సాంగ్ కి 8 మిలియన్ వ్యూస్...

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కిన బిన్నమైన కథా చిత్రం 1997.ఈ సినిమా చిత్రం నుండి ఏమి బతుకు ఏమి బతుకు అనే పాట విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే.

 8 Million Views For The Song aami Batuku Ami Batuk , 8 Million Views , Aami Batu-TeluguStop.com

ఈ పాట ఇటీవల విడుదల అయి సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించింది.అంతేకాక ఈ పాట యూ ట్యూబ్ లో 8 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.

ఈ కోటి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఈ ‘ఏమి బతుకు’ అనే పాటకు డాక్టర్ మోహన్ మరియు ఆదేష్ రవిలు లిరిక్స్ రాయగా, సింగింగ్ సెన్సేషన్ మంగ్లీ పాడింది.

ఎనిమిది మిలియన్ వ్యూస్ సాధించిన క్రమంలో కోటి మాట్లాడుతూ ఈ పాట మారుమ్రోగిపోతూ మీరు వినుంటారు, ఇప్పటికే 8 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ పాటను ప్రతి ఒక్కరూ ఆదరించారని అన్నారు.

ఈ పాటకు మోహన్ గారు చక్కటి సాహిత్యం అందించడం, మంగ్లీ గారు పాడడం అడ్వాంటేజ్ అని అన్నారు.ఆమె ఏ పాట పాడినా సూపర్ హిట్ అని ఆయన అన్నారు.

డాక్టర్.మోహన్ డైరెక్షన్ చేస్తూ సినిమాలో మెయిన్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారని, మన దేశంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి, కనీసం ఈ సినిమా చూసి అయినా వాళ్ళు మారతారు అని ఉద్దేశంతో మోహన్ గారు ఈ సినిమా చేశారని పేర్కొన్నారు.

అరుంధతి సినిమా తర్వాత తాను మ్యూజిక్ కి గ్యాప్ తీసుకున్నానని కానీ మోహన్ తనకు కొడుకు లాంటి వారని, ఆయన పట్టువదలకుండా మీరే చేయాలనీ కోరడంతో చేశానని అన్నారు.ఇక ఈ సినిమాను కచ్చితంగా ఆదరిస్తారని తాను నమ్ముతున్నానని ఆయన పేర్కొన్నారు.

ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ను వీలైన త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

నటీనటులు :

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు… బ్యానర్ : ఈశ్వర పార్వతి మూవీస్.ఎడిటింగ్ : నందమూరి హరి సంగీతం : కోటి కెమెరా : చిట్టి బాబు నిర్మాత: మీనాక్షి రమావత్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube