8 మంది మృతి : అక్కడ చిన్నా పెద్దా అంతా వయాగ్రా కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడుతారు

ఏం చేసినా కూడా పొట్ట కూటి కోసమే అనేది పెద్దలు చెప్పే మాట.అయితే కొందరు విలాసాల కోసం కష్టపడుతూ ఉంటే మరి కొందరు కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటారు.

 8 Including Toddler Die Collecting Himalayan Ingredients In Nepal-TeluguStop.com

మరి కొందరు ఇతరుల కోసం కష్టపడుతూ ఉంటారు.మొత్తానికి మనిషి జీవితంలో కష్టపడితేనే గౌరవం దక్కుతుంది.

ఏదైనా పని చేస్తూ చనిపోయినా కూడా అతడికి మంచి గుర్తింపు ఉంటుంది.కాని కొందరు లేజీగా ఏ పని చేయకుండా తిరుగుతూ ఉంటారు.

అలాంటి వారు సిగ్గు పడాల్సిన కథనం ఇది.నేపాల్‌కు చెందిన కొన్ని గ్రామాలకు చెందిన ప్రజలు ప్రాణాలకు తెగించి కష్టపడుతున్నారు.వారి గురించి ఇప్పుడు తెలుసుకుంది.

8 మంది మృతి : అక్కడ చిన్నా పెద్ద

హిమాలయాలకు సమీపంలో ఉండే నేపాల్‌కు చెందిన కొందరు గ్రామస్తులు ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు కొండల్లో ఏదో వెతుకుతూనే ఉంటారు.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా యార్సాగుంబా అనే మూలిక కోసం వెదుకుతూనే ఉంటారు.శృంగార సామర్థ్యంను పెంచే అద్బుతమైన ఔషదంగా దీనికి పేరు.

అందుకే దీన్ని నేపాలీ వయాగ్రా అని కూడా అంటారు.నేపాల్‌కు చెందిన వ్యాపారులు దీన్ని స్థానికుల నుండి కిలో అయిదు లక్షల చొప్పున కొనుగోలు చేసి విదేశాలకు ఆరు నుండి ఏడు లక్షలకు అమ్ముతూ ఉంటారు.

8 మంది మృతి : అక్కడ చిన్నా పెద్ద

పర్వాతాల మద్యలో, మంచు కొండల్లో ఈ మొక్క ఉంటుంది.15 నుండి 30 ఇంచులు ఉన్న చెట్లను సేకరించాల్సి ఉంటుంది.అందుకోసం పిల్లలు పెద్దలు అంతా వెళ్తారు.ఇటీవల ఈ వయాగ్రా మొక్కల కోసం వెళ్లిన 8 మంది మృత్యువాత పడ్డారు.అందులో ఇద్దరు పిల్లలు కూడా ఉండటం సోచనీయం.వందలాది మంది ప్రతి రోజు పర్వతాల్లోకి వెళ్లి అక్కడ వెదుకుతూ ఉంటారు.

గత పది సంవత్సరాల్లో వందలాది మంది మృతి చెందినట్లుగా స్తానికులు చెబుతున్నారు.అయినా వారి ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube