ఆహారధాన్యాలతో 8 అడుగుల మోదీ చిత్రం ఆ బాలిక ప్రతిభకు ఫిదా కావాల్సిందే!

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 71వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే.ఆయన బర్త్ డే నాడు దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు అతి పెద్ద కేకులు కట్ చేశారు.

 8 Foot Modi Movie With Food Grains . That Girl Needs To Pay For Her Talent Pm Mo-TeluguStop.com

అలాగే పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి పండగ వాతావరణాన్ని నెలకొల్పారు.ఈ సందర్భంగా సామాన్య ప్రజలు సైతం ఎంతోప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఓ కళాకారిణి మాత్రం వినూత్న ప్రయత్నం చేసి అందరి ప్రజలను బాగా ఆకట్టుకుంది.ఈమె ఆహార ధాన్యాలతో 8 అడుగుల పొడవైన ప్రధాని మోదీ చిత్రాన్ని రూపొందించి ఆశ్చర్యపరిచింది.

ప్రస్తుతం ఈ ఆహారధాన్యాల చిత్రపటం భారతదేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.మన దేశం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ కళాకారిణి దేశ ప్రధాని చిత్రాన్ని ధాన్యాలతో తయారుచేసింది.

ప్రియమైన మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు తన చిత్రపటాన్ని అంకితమిస్తున్నట్ల ఆమె తెలిపింది.

Telugu Latest, Pm Modi-Latest News - Telugu

ఈ చిత్ర పటాన్ని తయారు చేసింది ఒడిశా లోని భువనేశ్వర్ నివాసి అయిన ప్రియాంక సంహానీ.ఈ అద్భుతమైన కళా ఖండం లో మోదీ చిత్రంలోని గుండె వద్ద భారతదేశ మ్యాప్ ని గీసింది.ఈ చిత్ర పటం 8 అడుగుల పొడవు, 4 అడవుల వెడల్పు ఉంది.

ఈ అద్భుతమైన చిత్రాన్ని తయారు చేసేందుకు ఆమె అయిదారు రకాల ఆహార ధాన్యాలను వినియోగించింది.వాటిలో బియ్యం, పప్పు దినుసులు కూడా ఉన్నాయి.ఈ చిత్రపటం వైరల్ అయిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఒక చిన్న కళాకారిణిననికష్టమైనప్పటికీ ఈ చిత్రపటాన్ని 25 గంటలపాటు కృషిచేసి గీసానని చెప్పింది.కాగా, ప్రస్తుతం ఆమె కృషి, పట్టుదల ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

దేశానికి సంబంధించి మరిన్ని చిత్రాలను గీయాలిసిందిగా ఆమెను కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube