ఒక హత్య… ఎనిమిది మందికి జీవితఖైదు!  

8 family members get life imprisonment for man\'s murder in UP, 8 family members, UP, Heeralal, Murder, additional district and sessions judge - Telugu 8 Family Members, 8 Family Members Get Life Imprisonment For Man\\'s Murder In Up, Additional District And Sessions Judge, Eight People Arrested, Heeralal, High Court, Murder, One Murder, Up, Uttar Pradesh

కొన్ని సందర్భాల్లో కోర్టుల్లో శిక్ష ఆలస్యం కావచ్చు.కానీ తప్పు చేసిన వారికి శిక్ష తప్పనిసరిగా పడుతుంది.

TeluguStop.com - 8 Family Members Get Life Imprisonment For Mans Murder

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఐదేళ్ల క్రితం ఒక వ్యక్తిని చంపిన కేసులో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందికి కోర్టు జీవితఖైదు విధించింది.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఒకే కేసులో ఎనిమిది మందికి శిక్ష పడటంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది.40 సంవత్సరాల వయస్సు గల హీరాలాల్ యాదవ్ అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం దారుణ హత్యకు గురయ్యాడు.

TeluguStop.com - ఒక హత్య… ఎనిమిది మందికి జీవితఖైదు-General-Telugu-Telugu Tollywood Photo Image

పోలీసుల దర్యాప్తులో ఈ కేసులో దోషులు అతని ఇంటి పక్కన ఉన్న ఒకే కుటుంబానికి చెందిన సభ్యులే అని తేలింది.పథకం ప్రకారమే హీరాలాల్ హత్య జరిగిందని పోలీసులు గుర్తించారు.

తమ ఇంట్లోని మహిళను చూశాడన్న కారణంతో 2015 సంవత్సరం జులై నెల 27వ తేదీన కర్రలతో హీరాలాల్ పై ఆగ్రహంగా ఉన్న మహిళ కుటుంబ సభ్యులు దాడి చేశారు.కర్రల దాడి వల్ల హీరాలాల్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హీరాలాల్ మృతి చెందాడు.దీంతో హీరాలాల్ కుటుంబ సభ్యులు కేసు నమోదు చేయగా ఐదేళ్ల నుంచి కేసు విచారణ జరుపుతోంది.

జామ‌మ్ యాదవ్, విశ్వనాథ్, రాంసంజీవన్, రంభరోసా, రామ్‌ప్ర‌తాప్‌, చోటా యాదవ్, దావు యాద‌వ్ లకు అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి జివీత ఖైదుతో పాటు 10,000 రూపాయల జరిమానా విధించారు.

న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విని ఒకే కుటుంబానికి చెందిన 8 మంది కుటుంబ సభ్యులను దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది.

తీర్పు తమకు అనూకూలంగా వెలువడటంతో హీరాలాల్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.చిన్న విషయానికి ఆవేశానికి లోను కావడం వల్లే ఐదేళ్ల క్రితం హీరాలాల్ హత్య జరిగిందని… కోపాన్ని అదుపులో ఉంచుకుంటే నేరాలు తగ్గుతాయని పోలీసులు చెబుతున్నారు.

#Uttar Pradesh #8Family #EightPeople #One Murder #Heeralal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

8 Family Members Get Life Imprisonment For Mans Murder Related Telugu News,Photos/Pics,Images..