గిన్నీస్ రికార్డు నెలకొల్పిన ఎనిమిది కుక్కలు

అప్పుడప్పుడు పెంపుడు జంతువులు చేసే విన్యాసాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.వాటిలో ఉన్న అద్భుతమైన టాలెంట్ తో అందరిని మెస్మరైజ్ చేయడంతో పాటు రికారులు కూడా సృష్టిస్తూ ఉంటాయి.

 8 Dogs Come Together To Set A World Record For Conga, World Record, Guinness Rec-TeluguStop.com

అలాగే ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది పెంపుడు కుక్కలు కూడా గినీస్ రికార్డు సృష్టించాయి.జర్మనీకి చెందిన 12 ఏళ్ల డాగ్ ట్రైనర్ ఆ ఎనిమిది కుక్కలతో అద్భుతమైన ఫీట్ చేయించి ఆ రికార్డు క్రియేట్ అయ్యేలా చేశారు.

మొత్తం 8 కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చి వాటితో కొంగ చేయించింది.కొంగ అంటే ఒకే లైన్ లో కుక్కలన్నీ ఒక దాని వెనక ఒకటిగా రెండు కాళ్లతో నిల్చొని నడవాలి.

ఈ కొంగలో ఏ కుక్కా కింద పడకూడదు.లైన్ తప్పకూడదు.

అలెక్సా తన కుక్కలకు కొంగను బాగా నేర్పించింది.ఫలితంగా గిన్నీస్ బుక్ వారి ముందు అద్భుత ప్రదర్శన ఇచ్చి వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది.

నిజానికి కొంగ అనేది ఒకరకమైన డాన్స్.లాటిన్ అమెరికా దేశాల్లో ఒక వ్యక్తి వెనక మరో వ్యక్తి నిలబడి చైన్ లాగా ఏర్పడతారు.ఆ డాన్స్ ప్రేరణగా అలెక్సా తన కుక్కలకు కొంగ డాన్స్ నేర్పించింది.ఈ కుక్కల్లో అలెక్సాను ముందుగా ఒక కుక్కని పట్టుకోగా దాని వెనక మిగతా కుక్కలన్నీ సైజ్ వారీగా పట్టుకొని నిలబడ్డాయి.

ఆ తర్వాత అలెక్సా వెనక్కి నడుస్తూ కుక్కల్ని తనవైపు నడిపించింది.అన్నీ బుద్ధిగా నడిచి రికార్డు క్రియేట్ చేసాయి.

దీనికి సంబందించిన వీడియోని గిన్నీస్ వారు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన గంటల్లోనే వైరల్ అయ్యింది.ప్రపంచవ్యాప్తంగా దీన్ని 14 లక్షల మందికి పైగా ఆ వీడియో చూశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube