ఈ బాహుబలి భోజనం తింటే రూ.8.5 లక్షలు మీవే.. వీడియో వైరల్...

భారతీయ ఆహారాన్ని ఇష్టపడేవారు ఒక్క వంటకంతో సరిపెట్టుకోరు.అందుకే ఏ ప్రాంతానికి వెళ్లినా పులిహోర, చపాతీ, అన్నం, స్నాక్స్, డెజర్ట్‌లు, డ్రింక్స్ ఇలా రకరకాల వంటకాలను భోజనంతో సహా అందిస్తుంటారు రెస్టారెంట్ యజమానులు.

 8.5 Lakhs For Eating This Bahubali Meal Yourself Video Viral , Bahubali Meals, Latest News, Viral Latest, Viral News, Social Media, Viral Video, 8.5 Lakhs-TeluguStop.com

అయితే ఈ రోజుల్లో థాలీ అనే బాహుబలి భోజనానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది.ఈ భోజనంలో ఒకేసారి చాలా ఐటమ్స్ వడ్డిస్తారు.

వీటన్నింటినీ సింగిల్ సిట్టింగ్ లో ఆరగించాలి అంటే దాదాపు అసాధ్యమే.అయితే తాజాగా ఢిల్లీకి చెందిన ఒక రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.తమ రెస్టారెంట్లో వడ్డించే థాలీని 30 నిమిషాల్లో తినగలిగే కస్టమర్లకు రూ.8.5 లక్షలు ఇస్తామని ప్రకటించింది.ఈ థాలీని ‘ఐరన్ మ్యాన్ థాలీ‘ అని పిలుస్తారు.

 8.5 Lakhs For Eating This Bahubali Meal Yourself Video Viral , Bahubali Meals, Latest News, Viral Latest, Viral News, Social Media, Viral Video, 8.5 Lakhs-ఈ బాహుబలి భోజనం తింటే రూ.8.5 లక్షలు మీవే.. వీడియో వైరల్#8230;-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా @yumyumindia అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతా అప్‌లోడ్ చేసిన ఒక వీడియోలో ఈ భారీ ఐరన్ మ్యాన్ థాలీలో వడ్డించిన వంటకాలను మనం గమనించవచ్చు.ఇందులో కబాబ్స్, టిక్కాస్, చోలే, దమ్ ఆలూ, దాల్ మఖ్నీ, ఆలూ గోభి, కధీ, షాహీ పనీర్, కడాయి పనీర్, రోటీలు, బియ్యం అన్నం, బిర్యానీ, రెండు గిన్నెల గులాబ్ జామూన్ కనిపించాయి.

అంతేకాదు ఈ థాలీలో ఐదు రకాల పానీయాలు కూడా ఉన్నాయి. @yumyumindia ఫుడ్ బ్లాగర్ అకౌంట్ ప్రకారం, ఇద్దరు వ్యక్తులు ఈ థాలీని 30 నిమిషాల్లో పూర్తి చేయ గలిగితే, వారు రూ.8.5 లక్షలు గెలుచుకోవచ్చు! ఈ థాలీని ఢిల్లీలోని ఆర్డోర్ 2.1 రెస్టారెంట్ వడ్డిస్తోంది.

యమ్ యమ్ ఇండియా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.ఇందులో ఐటమ్స్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.ఇవన్నీ 30 నిమిషాల్లో ఇద్దరు వ్యక్తులు తినడం చాలా కష్టమే అని పలువురు కామెంట్లు పెట్టారు.

అయితే ఆహార పోటీల్లో ప్రావీణ్యం ఉన్న వారు ఈ థాలీని పూర్తి చేయ గలరు అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ థాలీలో వడ్డించిన ఆహార పదార్థాలు చూడ్డానికి చాలా రుచికరంగా ఉన్నట్లు కనిపించాయి.

కానీ అవన్నీ ఒకేసారి తినడం ఎవరికైనా కష్టమే.అందుకే రెస్టారెంట్ యజమాని రూ.8.50 లక్షలు ఇస్తామని ధైర్యంగా ఛాలెంజ్ విసిరింది.ఈ వీడియో ఇప్పటికే 13 లక్షల వ్యూస్ సంపాదించింది.ఒక లక్షా ఇరవై వేలకు పైగా లైక్‌ లను పొందింది.చాలా మంది ఈ థాలీ రుచికరంగా ఉందని కానీ దానిని పూర్తి చేయడం సవాలుగా ఉంటుందని వ్యాఖ్యానించారు! ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube