అచ్చం ధోని లా హెలికాప్టర్ షాట్లను కుమ్మేస్తున్న చిన్నారి...!

మహేంద్రసింగ్ ధోని… పెద్దగా పరిచయం చేయనక్కర లేని పేరు ఇది.28 సంవత్సరాల తర్వాత భారతదేశానికి క్రికెట్ లో వరల్డ్ కప్ అందించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.అంతేకాకుండా అనేక మ్యాచ్లను కూడా మహేంద్రుడు ఒంటిచేత్తో గెలిపించాడు.ఎదురుగా ఎటువంటి బౌలర్ ఉన్నాసరే దీటుగా ఎదుర్కొని బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న వ్యక్తి మహేంద్రసింగ్ ధోని.

 7 Year Old Kid Playing Like Ms Dhoni,ms Dhoni, Pari Sharma, India, Cricket, Heli-TeluguStop.com

ఇక ఈయన బ్యాటింగ్ తో హెలికాప్టర్ షాట్ ఎంత ప్రాముఖ్యం చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇదివరకు ఆ షాట్ ను ఆడటానికి ఎంతో మంది భారత క్రికెటర్లు ఆడడానికి ప్రయత్నించిన అచ్చం ధోనీల ఎవరు ఆడలేక పోయారు.

ఇకపోతే తాజాగా ఓ ఏడు సంవత్సరాలు ఉన్న చిన్నారి పేరు పరి శర్మ.ఆ చిన్నారి ధోని హెలికాప్టర్ షాట్ ను అచ్చం ధోని ఎలా బ్యాటింగ్ చేస్తాడో అలా ఆ అమ్మాయి చేస్తూ అందరినీ ఆకట్టుకునేలా బ్యాటింగ్ చేస్తోంది.

తాజాగా ఆ అమ్మాయి క్రికెట్ ఆడుతున్న సమయంలో తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.ఆ అమ్మాయి బ్యాటింగ్ చూసి పలువురు ఫిదా అయిపోయారు కూడా.

ఇందులో ఏకంగా విదేశీ క్రికెటర్లు మైకెల్ వాన్, షాయ్ హోప్ లుక్ కూడా ఉన్నారు.అతి చిన్న వయసులోనే ఇలా అద్భుతంగా ఫుట్ వర్క్ చూపిస్తూ బ్యాటింగ్ ఆడుతున్న అమ్మాయి ని చూసి వారు మంత్రముగ్దులు అయ్యారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్ మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ మైకెల్ వాన్ తన అధికారం ద్వారా చేశారు.

ఇకపోతే తాజాగా ఈ వీడియోని చూసి టీమిండియాలో ఉన్న కొందరు క్రికెటర్లు కూడా ఆ అమ్మాయికి అభిమానులుగా మారిపోయారు.ఇక అందుకు ఆకాష్ చోప్రా ఏకంగా ఆ వీడియోకు హిందీలో తన కామెంట్రీ ని జోడించడం కూడా ఆశ్చర్యమేసింది.ఇక సంజయ్ మంజ్రేకర్ అయితే ఏకంగా అందరూ హెలికాప్టర్ షాట్ ను సాధన చేయడం నేను చూశాను కానీ, వికెట్లకు అత్యంత సమీపంలో ఉన్న కానీ ఆ అమ్మాయి బ్యాటింగ్ ఎలా చేస్తుందో చూడండి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ చిచ్చరపిడుగు కొట్టిన హెలికాప్టర్ షాట్స్ ను కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube