వామ్మో.. ఆ పానీపూరీ తిని 77 మంది ఆసుపత్రి పాలు..!

77 People Ate That Panipuri And Got Hospital Milk

పానీపూరి పేరు చెబితే చాలు ఎవరి నోట్లో అన్నా నీళ్లు ఉరతాయి.వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పానీ పూరీని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.

 77 People Ate That Panipuri And Got Hospital Milk-TeluguStop.com

పానీ పూరీని మనం ఎక్కువగా రోడ్డుపక్కన చూస్తూ ఉంటాము కదా.వాటిని చూస్తే చాలు మన మనసు కంట్రోల్ తప్పి పోతుంది.ఒక ప్లేట్ తిందామని వెళ్లిన మనకు వాటిని చూడగానే ఒక పట్టు పెట్టనిదే అక్కడ నుంచి రాలేరు.అయితే పానీ పూరీ కూడా ఎక్కడ పడితే అక్కడ తినడం మంచిది కాదు.

ఎందుకంటే పానీ పూరీ తయారు చేసే నీరు కలుషితం అవుతున్నయని గతంలో మనం వినే ఉంటాము.సరిగ్గా ఇప్పుడు కూడా అలానే జరిగింది.అపరిశుభ్ర పానీ పూరీ తినడం వలన కొంతమంది ఆసుపత్రిపాలయ్యారు.ఒకరు ఇద్దరు అనుకునేరు.

 77 People Ate That Panipuri And Got Hospital Milk-వామ్మో.. ఆ పానీపూరీ తిని 77 మంది ఆసుపత్రి పాలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాదు ఏకంగా పానీపూరి తినడం వలన 77మంది అనారోగ్యం బారినపడ్డారు.

ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ లోని గటపార్‌ కాలా గ్రామంలో చోటు చేసుకుంది.

గటపార్‌ కాలా గ్రామంలో వారాంతపు రోజులో మార్కెట్ నిర్వహిస్తారు.ఈ మార్కెట్ కు వచ్చిన వారు అక్కడ ఉండే పానీపూరి తిన్నారు.

అంతే ఉన్నటుండి ఒక్కసారిగా కడుపులో తిప్పినట్టు అనిపించి, ఆ తరువాత వెంటనే వాంతులు చేసుకున్నారు.వీరిని గమనించిన అధికారులు వెంటనే వారందరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

వీరందరూ కూడా ఫుడ్‌ పాయిజన్ వల్లే ఇలా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని అధికారులు తెలిపారు.

మొత్తంగా ఆసుపత్రిలో 77మంది జాయిన్ అయితే వారిలో 57మంది పిల్లలే ఉండడం గమనార్హం అని చెప్పాలి.ఇప్పటికి 26 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయినట్లు తెలుస్తుంది.అయితే వీరంతా పానీపూరి తిన్న తరువాత తర ఫుడ్ ఐటెమ్స్ కూడా తిన్నారు.

మరి ఎలా ఫుడ్ పాయిజన్ అయ్యిందో అని తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు.ఇప్పటికన్నా ఎక్కడ పడితే అక్కడ తినడం మానేస్తే మంచిది.ఈ ఘటనతో గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు.

#Ghat #Panipoori #Chhattisgarh #Hospitalized

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube