విడ్డూరం : 75 ఏళ్ల బామ్మ విడాకులు కోరింది, తాతకున్న 'ఆ' పిచ్చితో బామ్మ ఈ నిర్ణయం

మన ఇండియాతో పోల్చితే పాశ్చాత్య దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ వంటి దేశాల్లో భార్య భర్తల బంధం చాలా బలహీనంగా ఉంటుంది.బాగా అభివృద్ది చెందిన దేశాలుగా చెప్పుకుంటున్న ఈ దేశాల్లో దంపతులు చాలా చిల్లర కారణాలతో విడాకులు తీసుకోవడం మనం గతంలో చాలా సార్లు చూశాం.

 75 Years Woman Wanted Divorce Because Of Husband Behavior 75-TeluguStop.com

వృద్దులు కూడా విడాకులు తీసుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి.తాజాగా ఆస్ట్రేలియాలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

రెండు నెలల క్రితం 75 ఏళ్ల బామ్మ తనకు విడాకులు ఇప్పించండి అంటూ కోర్టుకు వెళ్లింది.ఈ వయసులో విడాకులు ఎందుకా అని కుటుంబ సభ్యులు అంతా కూడా నోరెళ్లబెట్టారు.

విడ్డూరం : 75 ఏళ్ల బామ్మ విడాకుల

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఆస్ట్రేలియాకు చెందిన ఒక వృద్ద జంట కొడుకులు, మనవలు మనవరాళ్లతో జీవితం హాయిగా గడపకుండా వారికి దూరంగా ఒక ఫామ్‌ హౌస్‌లో జీవితాన్ని సాగిస్తున్నారు.పిల్లలతో ఉండటం ఇష్టం లేని ఆ తాతగారు ఈ నిర్ణయం తీసుకున్నాడు.కాని బామ్మకు మాత్రం పిల్లలతో ఉండటమే ఇష్టం.కాని ఆయన మాట కాదనలేక పోయింది.80 ఏళ్లకు పైగా ఉండే ఆ తాత డ్రగ్స్‌ వాడుతూ ఈ వయసులో కూడా రెగ్యులర్‌ గా శృంగారం కోరుకుంటూ ఉన్నాడట.ఈ వయసులో డ్రగ్స్‌ వాడకం మంచిది కాదని ఎంత చెప్పినా వినడం లేదని, రాత్రి, పగలు తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు నన్ను బలవంతం చేసేవాడని చెప్పుకొచ్చింది.

విడ్డూరం : 75 ఏళ్ల బామ్మ విడాకుల

వ్యభిచారం చేసే అమ్మాయిలను కూడా అప్పుడప్పుడు ఇంటికి తీసుకు వస్తున్నాడని, నువ్వు సుఖంను ఇవ్వకుంటే నాకు మరో మార్గం లేదు అంటూ నన్ను మానసికంగా కూడా హింసించాడు అంటూ ఆ బామ్మ కోర్టుకు తెలియజేసింది.అందుకే తనకు మరో ఆలోచన లేదని, విడాకులు తీసుకుని ఆయనకు విడిగా ఉండాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.ఈ వయసులో విడాకులు అవ్వడంతో కోర్టు కాస్త ఆలస్యం చేస్తోంది.

ఇద్దరికి కౌన్సిలింగ్‌ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.మరో నెల రోజుల్లో తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది.

ఆ లోపు వారిద్దరు కలిసి ఉండేందుకు కౌన్సిలింగ్‌ చేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube