మానవత్వం చాటుకున్న 75 ఏళ్ల వృద్ధుడు.. ప్రశంసిస్తున్న నెటిజెన్స్ !

కొంతమందిని చూస్తే ఇంకా మానవత్వం ఉందని అనిపిస్తుంది.కొన్ని సంఘటనలు విన్నప్పుడే అందరూ అయ్యో పాపం అనుకుంటారు.

 75-year-old Travels 300 Kms On Bike To Help Family Of Missing Covid Patient,madh-TeluguStop.com

అతి తక్కువ మంది మాత్రమే కష్టాల్లో ఉన్న వారికీ సహాయం చేయడానికి ముందుకు వస్తారు.ఈ రోజుల్లో పక్క వాళ్లకు కష్టం వచ్చిందంటే మనకు ఎందుకులే అని అనుకుంటాం.

కానీ వాళ్ళ కష్టాలకు చలించి కొంతమంది వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తారు.

అలాగే 75 సంవత్సరాల వ్యక్తి ఒక కుటుంభం కష్టాల్లో ఉందని పేపర్లో చదివి అతడు 300 కిలో మీటర్లు ప్రయాణించి మరి వారికీ తన వంతు సహాయం అందించాడు.

అది కూడా అతడు తన మోపెడ్ పైన 10 గంటలు ప్రయాణం చేసి మరి వెళ్లి వారికి సహాయం చేసాడు.ఈ విషయంపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అసలు విషయం లోకి వెళ్తే.

ఈ సంఘటన ఒరిస్సా లో చోటు చేసుకుంది.గంజాం జిల్లాకు చెందిన 75 సంవత్సరాల మధుసూదన్ అనే వ్యక్తి పేపర్ చదువుతూ కరోనా వార్డులో నుండి తప్పిపోయిన తన భర్త కోసం వెతుకుతూన్న భార్య కథనాన్ని చదివాడు.ఆ ఇంటి యజమాని తప్పిపోవడంతో వారు ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంటున్నారు.

ఆ విషయం చదివిన మధుసూదన్ ఆ కుటుంబానికి ఎలా అయినా సహాయం చేయాలనీ అనుకున్నాడు.

వెంటనే వారి గ్రామానికి బయల్దేరారు.

అతడు ఉంటున్న దగ్గర నుండి వాళ్ళ గ్రామం 300 కిలో మీటర్లు ఉండడంతో తన మోపెడ్ వేసుకుని 10 గంటలు ప్రయాణించి మరి వాళ్ళ గ్రామానికి చేరుకున్నాడు.తాను దాచుకుంటున్న సేవింగ్స్ నుండి 10 వేల రూపాయలు తీసి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసాడు.

తమకు సహాయం చేసినందుకు ఆ తప్పిపోయిన వ్యక్తి భార్య ఆయనకు కృతజ్ఞత తెలుపుతున్నారు.అంతేకాదు తన భర్త త్వరలోనే తిరిగి వస్తాడని కూడా ఆయన దైర్యం అందించాడని వివరించారు.

https://twitter.com/shubham_jain999/status/1410917828518047746

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube