75 కోట్ల దోమ‌ల‌తో 'యూఎస్'లో స‌రికొత్త ప్ర‌యోగం.. ఏంటంటే?

దోమలు.ఒక్కసారి కుడితే ప్రాణాలు పోకపోయినప్పటికి దోమ కాటుకు గురయ్యి మలేరియా, డెంగ్యూ, టైపాయిడ్, చికన్ గున్యా, ఎల్లో ఫీవర్ వంటి విష జ్వరాల బారిన పడేసే శక్తి వాటిలో ఉంది.

 75 Crore Mosquito Going To Be Released In America, 75 Crore Mosquitoes, Florida,-TeluguStop.com

వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ప్రతి ఏటా వర్షాకాలంలో ఎంతోమంది ఈ జ్వరాల భారిన పడి ప్రాణాలను వదులుతున్నారు.

ఈ నేపథ్యంలోనే 75 కోట్ల దోమ‌ల‌తో అమెరికా స‌రికొత్త ప్రయోగం చెయ్యాలని నిర్ణయించుకుంది.

నిజానికి పైన చెప్పిన వ్యాధులు అన్నీ కూడా ఏడిస్ ఏజిప్టి అనే ఆడ దోమ‌లు కుట్ట‌డం వల్లే వస్తున్నాయట.ఈ దోమలను నివారించేందుకు గాను యూఎస్ స‌రికొత్త‌ ప్ర‌యోగానికి సిద్ధం అయ్యింది.

జ‌న్యు ప‌రంగా వృద్ధి చేసిన 75 కోట్ల మ‌గ దోమ‌ల‌ను ఫ్లోరిడాలో వదలనున్నారు.

అయితే ఆ మగ దోమలతో మనుషులకు ఎటువంటి ప్రమాదం ఉండదని వారు చెప్తున్నారు.

కాగా ఈ మగ దోమలు అక్క‌డి ఆడ ఏడిస్ దోమ‌ల‌తో సంయోగం జరుపుతాయని, దాని వల్ల ఆడ ఏడిస్ దోమ‌లు కొంత కాలానికే మరణిస్తాయని వారు తెలిపారు.ఇలాంటి ప్రయోగమే 2016లో బ్రెజిల్ లో కూడా చేశారని అక్కడ అది విజయవంతం అయ్యిందని తెలిపారు.

కాగా చైనాలో కూడా ఇలానే దోమలకోసమే ప్రత్యేకమైన ఫ్యాక్టరీని పెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube