ఒంటి కొమ్ము వృద్ధుడు,ఎక్కడంటే!  

74 Years Old Mp Man Grows Devil\'s Horn After Injury - Telugu 74 Years Old Mp Man, 74 Years Old Mp Man Grows Devil\\'s Horn After Injury, Bhopal, Devil Horn, Syam Lal Yadav

ఒంటి కొమ్ము రాక్షసుడు గురించి వినే ఉంటారు.అదేలెండీ చూసికూడా ఉంటారు ఎందుకంటే జానపద చిత్రాల్లో ఇలాంటి ఒంటికొమ్ము రాక్షసుల ను మనం చాలా మందినే చూసే ఉంటాం.

74 Years Old Mp Man Grows Devil's Horn After Injury

కానీ ఇవన్నీ నిజంగా జరుగుతాయా కేవలం కల్పిత పాత్రలతో చిత్రాలను నిర్మించారు.అయితే నిజంగా ఇలాంటి ఒక చెట్టు కొమ్మ లాంటిది ఒకటి ఒక వృద్ధుడి తలపై మొలవడం ఇప్పుడు పెద్ద సంచలనం గా మారింది.

మధ్యప్రదేశ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.మధ్యప్రదేశ్ కు చెందిన శ్యామ్ లాల్ యాదవ్ అనే 74 ఏళ్ల వృద్ధుడు అరుదైన సమస్యతో బాధపడుతున్నారు.

ఒంటి కొమ్ము వృద్ధుడు,ఎక్కడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

కొన్నేళ్ల క్రితం శ్యామ్‌లాల్ తలపై చిన్న గాయం కాగా ఆ తర్వాత కొన్ని రోజులకు దాని స్థానంలో కొమ్ము లాంటి ఆకారంలో ఒకటి రావడం మొదలైంది.దీనితో అది చూడడానికి వికృతంగా కనిపించడం తో అతడు ఇంటిలోనే ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ వస్తున్నాడు.

అయితే కట్ చేసే కొద్దీ అది ఇంకా ఇంకా పెరిగిపోవడం తో చివరికి చేసేదేమీ లేక వైద్యులను సంప్రదించాడు.భోపాల్‌లోని సాగర్ భాగ్యోదయ్ ఆస్పత్రి వైద్యులు శ్యామ్‌లాల్‌కు వైద్యం చేసి ఎట్టకేలకు దాన్ని తొలగించారు.

దీంతో శ్యామ్‌లాల్‌కు ఉపశమనం లభించినట్టయింది.సాధారణంగా దీన్ని డెవిల్ హార్న్ అంటారని వైద్య పరిభాషలో సెబాసియస్ హార్న్ అంటారని వైద్యులు తెలిపారు.

ఎండ వేడి తగిలే ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా ఏర్పడుతుందని చెప్పారు.

మరోసారి అలాంటి హార్న్ రాకుండా సర్జరీ చేసి దాన్ని పూర్తిగా తొలగించామని చెప్పారు.

అయితే ఇది అత్యంత అరుదైన ఆపరేషన్‌ అని,ఈ కేసు అరుదైనది కాబట్టి దీని వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ సైన్స్ లో ప్రచురణార్థం పంపిస్తామని వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

74 Years Old Mp Man Grows Devil\'s Horn After Injury-74 Years Old Mp Man Grows Devil\\'s Horn After Injury,bhopal,devil Horn,syam Lal Yadav Related....